ఫ్యామిలీ ఎఫెక్ట్‌.. బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారే?

దొర‌క్క దొరికిన అవ‌కాశం ల‌భించినా.. దానిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో మాత్రం ఆ మంత్రి విఫ‌ల‌మ ‌వుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. కురుపాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా రెండుసార్లు విజ‌యాలు [more]

Update: 2020-12-03 13:30 GMT

దొర‌క్క దొరికిన అవ‌కాశం ల‌భించినా.. దానిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో మాత్రం ఆ మంత్రి విఫ‌ల‌మ ‌వుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. కురుపాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా రెండుసార్లు విజ‌యాలు సాధించిన పుష్ప శ్రీవాణికి జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఉన్నత‌స్థానం క‌ల్పించారు. డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఇచ్చారు. అయితే.. ఏడాదిన్నర‌గా ఆమె సాదించిన మెరుపులు ఏమీక‌నిపించ‌డం లేద‌న్న టాక్ అటు ప్రభుత్వ వ‌ర్గాలు, ఇటు పార్టీ నేత‌ల నుంచే వ‌చ్చేసింది. ఆమెకు మంత్రి ప‌ద‌వి రావ‌డంతో వెన‌క‌ప‌డిన కురుపాం ఎంతో అభివృద్ధి చెందుతుంద‌ని ఆశించిన నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల్లోనూ నిరాశే క‌నిపిస్తోంది. క‌రోనా వేవ్ ప్రారంభానికి ముందు పుష్ప శ్రీవాణి నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రమే అప్పుడ‌ప్పుడూ ప‌ర్యటించేవారు. ఆ త‌ర్వాత మంత్రిగా రాష్ట్ర స్థాయిలో కాదు క‌దా.. క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు కూడా మొఖం చూపించ‌డం లేద‌ట‌.

ఆయన లేకుండా చూసుకుని….

పుష్ప శ్రీ వాణి స్థానికంగా కూడా ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని…. నియోజ‌క‌వ‌ర్గానికి కూడా అందుబాటులో ఉండ‌డం లేద‌ని అంటున్నారు. ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయ‌న్న చ‌ర్చలు కురుపాంలో వినిపిస్తున్నాయి. ప్రారంభంలో ఆమె మంత్రి అయిన త‌ర్వాత‌.. మంత్రివ‌ర్గంలోనే సీనియ‌ర్ అయిన ఒక‌రు ఆమెపై ఆధిప‌త్యం చ‌లాయించార‌నే టాక్ వ‌చ్చింది. దీంతో ఆమె చాలా వ‌ర‌కు కార్యక్రమాల‌కు దూరంగా ఉన్నారు. ఇక‌, ఆ త‌ర్వాత కూడా ఆమె పాల్గొన్నా.. మంత్రిగారు లేని కార్యక్రమాల‌ను ఎంచుకుని పాల్గొనే వార‌ని చెబుతున్నారు. అయినా కూడా ఎక్కడా దూకుడు లేక‌పోవ‌డంతో ఆమెకు మైన‌స్ మార్కులు ప‌డ్డాయి.

కుటుంబం నుంచి కూడా…..

నియోజ‌క‌వ‌ర్గంలోనే పుష్ప శ్రీవాణికి వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పుతోన్న స‌ద‌రు సీనియ‌ర్ మంత్రి మ‌రో మ‌హిళా నేత‌ను టీడీపీలోనుంచి తీసుకువ‌చ్చి మ‌రి ఎంక‌రేజ్ చేస్తున్నారు. దీనిపై ఆమె అధిష్టానానికి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదు. దీంతో పుష్ప శ్రీవాణి స‌ద‌రు సీనియ‌ర్ కంటే ముందే పార్టీలోకి వ‌చ్చి.. రెండుసార్లు గెలిచి.. డిప్యూటీ సీఎంగా ఉన్నా త‌న‌కు ప్రాధాన్యత లేద‌ని తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నార‌ట‌. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. త‌న కుటుంబం నుంచే మంత్రిగారికి స‌హ‌కారం లేద‌నే టాక్ వినిపిస్తోంది. దీనికి ఆమె మామ‌గారు చేసిన వ్యాఖ్యల‌ను ఇప్పటికీ ఉటంకిస్తున్నారు.

ఏదో మమ అనిపిస్తూ…..

ఈ ప‌రిణామాల‌తో స్థానికంగా మంత్రి పుష్ప శ్రీవాణి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని చెబుతున్నారు. కొన్ని కొన్ని కార్యక్రమాల‌కు వ‌స్తున్నా.. ఏదో వ‌చ్చిన‌ట్టు వ‌చ్చి వెళ్లిపోతున్నార‌ని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ప‌రిణామాలు.. మంత్రిపై మైన‌స్ మార్కులు ప‌డేలా చేస్తున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఇప్పటికైతే.. మంత్రి త‌న‌కు ఎఫెక్ట్ లేద‌ని అనుకున్నా.. మున్ముందు పుష్ప శ్రీవాణిలో దూకుడు లేక‌పోతే.. ఇబ్బందిక‌ర ‌ప‌రిస్థితి త‌ప్పద‌ని పార్టీ, ప్రభుత్వ వ‌ర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.

Tags:    

Similar News