“పుట్టా” ప‌ని అయిపోయిందా ?

టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నాయ‌కుడు.. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ రాజ‌కీయం ఇక‌, ముగిసిన‌ట్టేనా ? ఆయ‌నను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం కూడా లేదా ? పార్టీలోనూ ఆయ‌న‌ను [more]

Update: 2021-02-27 11:00 GMT

టీటీడీ మాజీ చైర్మన్, టీడీపీ నాయ‌కుడు.. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ రాజ‌కీయం ఇక‌, ముగిసిన‌ట్టేనా ? ఆయ‌నను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం కూడా లేదా ? పార్టీలోనూ ఆయ‌న‌ను ప‌క్కన పెట్టారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసే అవ‌కాశం ఇచ్చినా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ విజ‌యం సాధించ‌లేక పోయారు. దీంతో ఆయన పెద్ద ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డిపోయింది. పోనీ.. పార్టీ ప‌రంగా అయినా.. స‌త్తా చాటుతున్నారా ? అంటే.. అది కూడా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న‌కు ఓ వ్యక్తిగ‌త ఇమేజ్ అంటూ కూడా లేకుండా పోయింది. పుట్టా త‌న వియ్యంకుడు.. తూర్పు గోదావ‌రికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఇమేజ్ పైనే ఆధార‌ప‌డ్డారు.

యనమల చెప్పినట్లే విన్నా…?

పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ విష‌యంలో ప‌దే ప‌దే చంద్రబాబు య‌న‌మ‌ల చెప్పిన‌ట్టు వినేవారు. అయితే ఇక పుట్టాకు టీడీపీలో కాలం చెల్లిపోయింద‌న్న చ‌ర్చలే వినిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికే ఇచ్చిన రెండు సార్లు కాకుండా మ‌రో రెండు సార్లు చంద్రబాబు టీడీపీ సీటు ఇచ్చినా పుట్టా ఓడిపోవ‌డం ప‌క్కా అన్న టాక్ టీడీపీ వ‌ర్గాల్లోనే వ‌చ్చేసింది. ఇది ప‌క్కన పెడితే ఆయ‌న‌కు గాడ్ ఫాద‌ర్‌గా ఉన్న రాజ‌కీయ దిగ్గజం య‌న‌మ‌ల ప‌రిస్థితే మైన‌స్‌గా మారింది. తుని నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుస ఓట‌ములు.. య‌న‌మ‌ల హ‌వా పూర్తిగా త‌గ్గిపోవ‌డం.. కేడ‌ర్‌ను కూడా స‌మాయ‌త్తం చేయ‌లేక పోవ‌డం వంటి కార‌ణాల‌తో య‌న‌మ‌ల‌ను కూడా ప‌క్కన పెట్టారు.

పంచాయతీ ఎన్నికల్లోనూ…

ఒక‌ప్పుడు య‌న‌మ‌ల చెప్పిందే రాష్ట్ర పార్టీలో వేదంగా ఉంటూ వ‌చ్చింది. అయితే ఇప్పుడు లోకేష్ హ‌వాతో తూర్పు గోదావ‌రిలోనూ య‌న‌మ‌ల ప్రాధాన్యం క్రమ‌క్రమంగా త‌గ్గిపోతూ చిన‌రాజ‌ప్ప హ‌వా పెరిగిపోతోంది. చంద్రబాబు సైతం య‌న‌మల మాట‌లు ఏ మాత్రం విన‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాల టాక్ ? దీంతో య‌న‌మ‌ల‌ను చూసి.. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ ను ప‌ట్టించుకుని.. టీడీపీలో ఛాన్స్ ఇవ్వడం అనేది క‌ల్లేన‌ని తెలుస్తోంది. తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ.. పుట్టా త‌న స‌త్తాచాట‌లేక పోయారు. ఎమ్మెల్యే ర‌ఘురామి రెడ్డి వ్యక్తిగ‌త ఇమేజ్‌కు తోడు జిల్లాలో వైసీపీ ఇమేజ్ బ‌లంగా తోడు అవ్వడంతో నియోజ‌క‌వ‌ర్గంలో మూడొంతుల‌కు పైగా పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి.

పట్టు తగ్గిపోయిందనడానికి….

అంత‌కు ముందు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ క్యాండెట్ల‌తో పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చాలా చోట్ల నామినేష‌న్లే వేయించ‌లేక‌పోయారు. దీనిని బ‌ట్టి మైదుకూరులో పార్టీలోనే ఆయ‌న‌కు ఏ మాత్రం ప‌ట్టు ఉందో తెలిసిపోతోంది. దీనికి తోడు టీడీపీని ఎప్పటి నుంచో అభిమానించే కొన్ని వ‌ర్గాలు పుట్టా తీరుతో ఆయ‌న‌కు, పార్టీకి పూర్తిగా దూరం అయ్యాయి. పార్టీని ప‌టిష్టం చేయ‌డం మానేసి… లాబీయింగ్‌తో మ‌ళ్లీ టిక్కెట్ తెచ్చుకోవ‌చ్చన్న ఆలోచ‌న నుంచి పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ బ‌య‌ట‌కు రాక‌పోతే మైదుకూరు ఇన్‌చార్జ్ విష‌యంలో మార్పులు త‌ధ్యమ‌ని.. ఎంత బల‌మైన ఒత్తిడి ఉన్నా.. చంద్రబాబు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేద‌న్నది వాస్తవం. మ‌రి పుట్టా మైదుకూరులో స్ట్రాంగ్ అవ్వకుండా…. య‌న‌మ‌ల ఆశ‌ల పల్లకీలో తేలుతూ ఉంటే దుకాణం బంద్ చేసుకోవడం మిన‌హా వేరే గ‌త్యంత‌రం లేదు.

Tags:    

Similar News