Raghu : రెండు పార్టీల నుంచి ఆఫర్లు… త్వరలోనే డెసిషన్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యూహమేంటి? ఆయన పూర్తికాలం వైసీపీలో కొనసాగుతారా? లేక మధ్యలో రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరతారా? అన్న చర్చ జరుగుతోంది. రఘురామ [more]

Update: 2021-11-10 12:30 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యూహమేంటి? ఆయన పూర్తికాలం వైసీపీలో కొనసాగుతారా? లేక మధ్యలో రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరతారా? అన్న చర్చ జరుగుతోంది. రఘురామ కృష్ణరాజు ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. అయితే ఆయనకు ంెండు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని తెలిసింది.

ముందుగానే చేర్చుకుని….

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రఘురామ కృష్ణరాజు ను తమ పార్టీలో చేరాలని కోరుతున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంపీ ఈ సమయంలో పార్టీలో చేరడం వల్ల పార్టీకి హైప్ పెరుగుతుందని టీడీపీ ఆశిస్తుంది. అందుకోసం వీలయినంత త్వరగా చేరాలని, వచ్చే ఎన్నికల్లోనూ టిక్కెట్ ఖరారు చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామ కృష్ణరాజు పర్యటించేలా ఏర్పాటు చేయాలని టీడీపీ భావిస్తుంది.

పార్టీకి హైప్….

రఘురామ కృష్ణరాజు విమర్శలను ప్రజలు పాజిటివ్ గా తీసుకుంటారని టీడీపీ భావిస్తుంది. ఇప్పడే చేరాల్సిన అవసరం లేదని, మద్దతుదారుగా నిలిచినా చాలని ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఒక సిట్టింగ్ ఎంపీ పార్టీలో చేరడం వల్ల మిగిలిన నేతలు కూడా ఆలోచనలో పడతారన్నది టీడీపీ అధినేత ఆలోచనగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీని దెబ్బతీయాలన్న వ్యూహంలో రఘురామ కృష్ణరాజును ముందుగానే పార్టీలో చేర్చుకోవాలని భావిస్తుంది.

జనసేన కూడా….

మరోవైపు రఘురామ కృష్ణరాజుకు జనసేన కూడా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. జనసేన నుంచి వచ్చే ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పిందట. అంతేకాదు కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తుందని, అదే జరిగితే కేంద్ర మంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉందని ఊరించిందని సమాచారం. దీంతో రఘురామ కృష్ణరాజు ఏపార్టీలో చేరాలన్నది నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తారంటున్నారు.

Tags:    

Similar News