Raghu : సుద్దులు అందరికీ చెబుతావా? ఈటలను చూసైనా ..?
సుద్దులు చెప్పే రాజుగారికి ఇప్పుడు సూటి ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి. ఆ దమ్ము ధైర్యం ఉందా? అన్న నిలదీత మొదలయింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హుజూరాబాద్ [more]
సుద్దులు చెప్పే రాజుగారికి ఇప్పుడు సూటి ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి. ఆ దమ్ము ధైర్యం ఉందా? అన్న నిలదీత మొదలయింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హుజూరాబాద్ [more]
సుద్దులు చెప్పే రాజుగారికి ఇప్పుడు సూటి ప్రశ్నలు వచ్చి పడుతున్నాయి. ఆ దమ్ము ధైర్యం ఉందా? అన్న నిలదీత మొదలయింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హుజూరాబాద్ ఎన్నికల ప్రభావం బాగా పడుతుంది. అక్కడ ఈటల రాజేందర్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించి బాద్ షా గా నిలిచారు. కానీ రఘురామ కృష్ణరాజు మాత్రం పార్టీ చీదరించుకున్నా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు.
నిత్యం నీతులు చెబుతూ….
పైగా ప్రతిరోజూ సుద్దులు చెబుతూ రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రఘురామ కృష్ణరాజు గెలిచింది వైసీపీ గుర్తుపై. నిజంగా ఆయనకు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో వ్యక్తిగత బలం ఉండి ఉండవచ్చు. ఆయన గెలిచింది తన బొమ్మ వల్లనే కావచ్చు. అంతటి చరిష్మా, శక్తి ఉన్న రఘురామ కృష్ణరాజు ఎందుకు ఆ పార్టీని పట్టుకుని వేలాడుతున్నారన్న ప్రశ్నలు సహజంగానే విన్పిస్తాయి.
బహిష్కరణను…
తాను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి ఏదో ఒక పార్టీలో చేరి గెలిచే అవకాశముంది. కానీ రఘురామ కృష్ణరాజు ఆ పని చేయడం లేదు. తనను పార్టీ బహిష్కరించాలని కోరుకుంటున్నారు. తెలంగాణలోనూ ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కేవలం మంత్రివర్గం నుంచి మాత్రమే తొలగించారు. ఆయనంతట ఆయనే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి షంషేర్ గా తిరిగి గెలిచి తన సత్తా నిరూపించుకున్నారు.
ప్రతి రోజూ….
ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కూడా అదే బాటలో పయనించాలని ఆయనను అభిమానించే వారు సయితం కోరుకుంటున్నారు. కానీ ఆయనకు మాత్రం ఉప ఎన్నికలకు వెళ్లే యోచన లేదు. రోజూ పార్టీని, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తూ తనపై బహిష్కరణ వేటు పడాలని కోరుకుంటున్నారు. నిన్న హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాజుగారి మీద సోషల్ మీడియాలో సెటైర్లు ఎక్కువగా కన్పిస్తున్నాయి. తన మీద తనకు నమ్మకంలేకనే ఆయన రాజీనామాకు సిద్ధపడటం లేదన్నది వాస్తవం.