కథ నడుపుతున్నారుగా…సంఝా
నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగను అంటూ యువనేత రాహుల్ గాంధి కాడి వదిలేసి పారిపోవడాన్ని కుర్ర చేష్టగానే అంతా భావిస్తున్నారు. రాజకీయాలు మనం అనుకున్నట్లుగా సాగవు. వాటిని [more]
నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగను అంటూ యువనేత రాహుల్ గాంధి కాడి వదిలేసి పారిపోవడాన్ని కుర్ర చేష్టగానే అంతా భావిస్తున్నారు. రాజకీయాలు మనం అనుకున్నట్లుగా సాగవు. వాటిని [more]
నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగను అంటూ యువనేత రాహుల్ గాంధి కాడి వదిలేసి పారిపోవడాన్ని కుర్ర చేష్టగానే అంతా భావిస్తున్నారు. రాజకీయాలు మనం అనుకున్నట్లుగా సాగవు. వాటిని మనకు అనుకూలంగా చేసుకోవాలి. అంతవరకూ ఓపిక, సహనం చాలా అవసరం. అయితే రాహుల్ గాంధీ తీరు చూస్తే ఆ రెండూ కనబడవు. పార్టీని పటిష్టం చేసుకునేందుకు అయిదేళ్ల సమయం ఉన్నా వ్రుధా చేసుకున్న యువరాజు మోడీ వ్యతిరేకేత మీద పూర్తిగా ఆధారపడ్డారు. ఏదో పెద్ద ఎత్తున మోడీని జనం అంతా వ్యతిరేకిస్తున్నారన్న భ్రమల్లో పడి ఎన్నికల రంగంలోకి దిగారు. ఒక ప్రధాని అని కూడా చూడకుండా మోడీని నానా మాటలు అన్నారు. దేశంలో ఉన్న ప్రధాన సమస్యల మీద ఓ విధానం అంటూ లేకుండా కధ నడిపిన రాహుల్ గాంధి దారుణమైన ఫలితాలను చూసిన తరువాత చివరికి తాను ప్రెసిడెంట్ గా ఉండనంటూ కిరీటం పక్కన పడేసారు. తరువాత ఇపుడు ఏమైంది. ఆయన అనుకున్నట్లుగానే జరిగిందా.
పబ్బం గడుపుకుంటున్న సీనియర్లు…..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూస్తే బాధ అనిపిస్తుంది. నూటా ముప్పయ్యేళ్ళ వయసు ఉన్న పార్టీ ఇలా అయిపోయిందేంటన్న ఆవేదన కలుగుతుంది. సోనియా గాంధి అనారోగ్యంతో రెండేళ్ల క్రితమే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటే మీరే దిక్కు అంటూ వృధ్ధతరం నాయకులు ఆమెను కోరి మరీ తీసుకువచ్చి తాజాగా కుర్చీలో కూర్చోబెట్టారు. దీని వెనక ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లో అధికారం ఉంది అక్కడ వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పరం అవుతాయి. దాంతో ఆమె వద్ద పరపతి సంపాదించుకున్న సీనియర్లు ఆమె కరుణతో మళ్ళీ రాజ్యసభకు నామినేట్ కావాలని పరితపిస్తున్నారు. అందుకోసం మాత్రమే వారు సోనియాగాంధీని ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోబెట్టి కధ నడుపుతున్నారు. ఇక సోనియాగాంధి కూడా మునుపటి మాదిరిగా జనంలో తిరిగే ఓపిక లేదు, పార్టీ చాలా రాష్ట్రాలో పడకేసింది. చాలా మంది నాయకులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని బీజేపీ సొమ్ము చేసుకుంటోంది.
అప్పటికైనా దొరికేనా..?
కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబానికి చెందని వారు అధ్యక్షుడు కావాలని రాహుల్ గాంధి షరతు పెట్టారు. అందుకే తాను తప్పుకుంటున్నానని ఆయన అన్నారు. దీనికి నెల రోజుల వ్యవధి కూడా ఆయన ఇచ్చారు. మూడు నెలలు అయినా ఎవరూ దొరకకపోవడంతో ఆఖరుకి సోనియానే అందాకా మా అధినేత అనిపించేసుకున్నారు. మరి రాహుల్ గాంధి పంతం నెరవేరిందా అంటే అదీ లేదు. పార్టీ బాగుపడిందా అంటే అంతకంటే లేదు. సీనియర్ నాయకులంతా తమ పదవుల కోసం సోనియాను మరో ఆరునెలలు ఉండమన్నారు. ఆ ఆరు నెలల్లో పెద్దల సభలో చాలామందిని సీట్లు లభిస్తాయి కానీ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు దొరుకుతాడా అన్నదే ఇక్కడ ప్రశ్న. అంటే కాంగ్రెస్ పార్టీని ముందుండి నడపాల్సిన రాహుల్ గాంధీ తాను చెసిన కుర్ర చేష్టల వల్ల మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. రేపటి రోజున కాంగ్రెస్ ఇంకా కునారిల్లిందంటే దానికి పూర్తి బాధ్యత రాహుల్ గాంధి తప్ప మరొకరు కారన్నది అంతా అంటున్న మాట.