రాహుల్ ఇక స్ట్రిక్ట్ అట.. తోక జాడిస్తే…?

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ రాష్ట్రాల విషయంలో నిక్కచ్చిగా ఉండాలని నిర్ణయించారు. పార్టీ నేతల మధ్య విభేదాలు విజయావకాశాలను దెబ్బతీస్తుండటంతో నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ [more]

Update: 2021-08-10 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ రాష్ట్రాల విషయంలో నిక్కచ్చిగా ఉండాలని నిర్ణయించారు. పార్టీ నేతల మధ్య విభేదాలు విజయావకాశాలను దెబ్బతీస్తుండటంతో నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. సోనియా గాంధీ పేరుకు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీ చేతుల మీదుగానే జరిగిపోతున్నాయి. ఆయన అనుకున్నది అనుకున్నట్లు అమలుపరుస్తున్నారు.

తలబొప్పి కట్టడంతో….

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. తనకు అత్యంత ఆప్తుడైన జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం కూడా సీనియర్ నేతల వైఖరి కారణమని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. రాజస్థాన్ లోనూ అదే పరిస్థితి. సచిన్ పైలెట్ కు, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఎన్నిసార్లు పంచాయతీ చేసినా ఫలితం కన్పించడం లేదు. సచిన్ పైలెట్ ను బతిమాలి, బామాలి కాంగ్రెస్ లో కొనసాగించేలా చూడగలిగారు.

ఇక కఠిన నిర్ణయాలే….

ఇక పంజాబ్ లోనూ అదే పరిస్థితి. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు, నవజ్యోత్ సింగ్ సిద్ధూకు పొసగడం లేదు. వీరిద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. పంజాబ్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న రాష్ట్రం కావడంతో సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అమరీందర్ సింగ్ ఏకపక్ష నిర్ణయాలకు రాహుల్ గాంధీ బ్రేకులు వేశారు. పార్టీ రాష్ట్ర నేతల్లో చేతల్లో లేదని రాహుల్ గాంధీ ఈ నియామకం ద్వారా బలమైన సంకేతాలను పంపగలిగారు.

ఆశలు ఎవరూ పెట్టుకోవద్దు…..

ఇక కర్ణాటకలోనూ కాంగ్రెస్ అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది. అక్కడ పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మధ్య పొసగడం లేదు. దీంతో ఇద్దరినీ ఢిల్లీకి పిలిపించి రాహుల్ గాంధీ క్లాస్ పీకారని టాక్. ఎవరికీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరమే ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయిస్తామని, ఇద్దరూ ఆశలు పెట్టుకోవద్దని చెప్పినట్లు టాక్. మొత్తం మీద రాహుల్ గాంధీ పార్టీని తన చేతుల్లోకి పూర్తిగా తీసుకోవడమే కాకుండా, కఠిన నిర్ణయాల దిశగా పయనిస్తున్నారు.

Tags:    

Similar News