అందుకేనా వాయిదా….తెలివైన పనేనా?

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రావాలంటే మరో ఐదారు నెలలు ఆగక తప్పదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, అసోం [more]

Update: 2021-02-01 17:30 GMT

కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రావాలంటే మరో ఐదారు నెలలు ఆగక తప్పదు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, అసోం రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అధ్యక్షుడి ఎంపిక ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పింది. దీంతో రాహుల్ గాంధీయే తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశముందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ కోసమే ఈ ఎన్నికను వాయిదా వేసినట్లు కనపడుతుందని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత…..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో కూటమితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముంది. అలాగే కేరళలో సంప్రదాయం ప్రకారం అయితే కాంగ్రెస్ కూటమి పవర్ లోకి రావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ లో అసలు కనీస స్థాయిలో స్థానాలను దక్కించుకునే అవకాశమూ లేదు. పుదుచ్చేరి, అసోంలలో స్పల్ప అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత జరిగే ఎన్నికల్లో ఓటమి పాలయితే మరోసారి జవాబు చెప్పుకోవాల్సి వస్తుందని ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోసారి ఓటమిని చూస్తే…..

గత లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తానే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోసారి బాధ్యతలను చేపట్టిన తర్వాత ఓటమి ఎదురయితే నవ్విపోతారని భావించి ఎన్నికను వాయిదా వేసినట్లు కనపడుతుంది. నిజానికి వేరే వారికి అధ్యక్ష పదవిని ఇవ్వాలనుకున్న తరుణంలో ఈ ఎన్నికను వెంటనే నిర్వహించేవారంటున్నారు.

సీనియర్లు డిమాండ్ చేసినా….?

ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ సీనియర్ నేతలు పార్టీ సంస్థాగత ఎన్నికలను వెంటనే జరపాలని కోరారు. రెబల్ నేతలుగా గుర్తింప పడిన వీరి డిమాండ్ ను అధిష్టానం తెలివిగా పక్కన పెట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనాలంటే శాశ్వత అధ్యక్షుడి ఎంపిక అవసరమని వాదించారు. అయితే అధిష్టానం మాత్రం కుదరదు పొమ్మని చెప్పింది. దీంతో రాహుల్ గాంధీ కోసమే ఈ ఎన్నికను వాయిదా వేశారన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News