రాహుల్ …ఇకనైనా మనసు మార్చుకోవూ?

రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎవరినో ఒకరిని అధ్యక్షుడిని చేయాలని రాహుల్ గాంధీ అగ్రనాయకత్వానికి చెబుతూ వస్తున్నారు. [more]

Update: 2021-03-15 16:30 GMT

రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎవరినో ఒకరిని అధ్యక్షుడిని చేయాలని రాహుల్ గాంధీ అగ్రనాయకత్వానికి చెబుతూ వస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశముంది. ఎక్కువ మంది నేతలు రాహుల్ గాంధీనే తిరిగి అధ్యక్షుడిగా నియమించాలని వత్తిడి తెస్తున్నా రాహుల్ గాంధీ మాత్రం ససేమిరా అంటున్నారు.

కొత్త అధ్యక్షుడు వచ్చినా….

అయితే ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్ప మరొకరు వచ్చినా ఏం చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొంచెం ఆశగా కన్పించేవి తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలు మాత్రమే. పుదుచ్చేరి చిన్న రాష్ట్రం కావడంతో అక్కడ ఓడినా, గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పశ్చి మ బెంగాల్ లో మాత్రం కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలే లేవు.

అంతా తానే అయి…..

ఎన్నికల ఫలితాల అనంతరం కూడా కాంగ్రెస్ విజయం సాధించిందని రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు మాత్రం కన్పించడం లేదు. ఫలితాలు ఎలా వచ్చినా రాహుల్ గాంధీ పదవిని చేపట్టాలనుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన ప్రచార కర్తగా మారారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో బయలకు రాలేకపోతుండంతో అంతా రాహుల్ గాంధీయే పర్యవేక్షిస్తున్నారు.

ముఖ్యమైన నిర్ణయాలన్నీ……

ఆ యా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక అంతా రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఒకవేళ రాహుల్ గాంధీ కాకుండా కొత్త అధ్యక్షుడు వచ్చినా ఫలితం ఏముంటుందన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. కేవలం ఉత్సవ విగ్రహంలా ఉండాలే తప్ప ఏ పవరూ ఆయన చేతిలో ఉండదు. పార్టీని పరోక్షంగా రాహుల్ గాంధీయే శాసిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే రాహుల్ గాంధీయే అధ్యక్ష పదవిని చేపట్టాలని సీనియర్ నేతలు సయితం డిమాండ్ చేస్తున్నారు. నిజమే కదా? షాడో అధ్యక్షుడిగా ఉండే కంటే నేరుగా బాధ్యతలు స్వీకరిస్తే బెటరన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News