రాహుల్ కు ఓకే నట… ఆ నిర్ణయాలు తీసుకుంటేనే?

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తికావడంతో సోనియా గాంధీ సూచనల మేరకు రాహుల్ గాంధీ అధ్యక్ష [more]

Update: 2021-05-15 17:30 GMT

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కూడా పూర్తికావడంతో సోనియా గాంధీ సూచనల మేరకు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని స్వీకరించేందుకు అంగీకరించారు. త్వరలోనే ఆయన అధ్యక్ష పదవిని చేపడతారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కొన్ని షరతులను విధించినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు.

అందరి వత్తిడితో….?

2019 ఎన్నికల వరకూ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఎన్నికల ఫలితాల అనంతరం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు. సీనియర్ నేతలు సయితం రాహుల్ గాంధీని అధ్యక్ష పదవి చేపట్టాలని కోరారు. శాశ్వత అధ్యక్షుడు పార్టీకి ఉంటేనే క్షేత్రస్థాయిలో బలంగా ఉంటుందని సూచించారు. అయినా రాహుల్ గాంధీ మాత్రం తొలుత అంగీకరించలేదు.

వచ్చే పార్లమెంటు ఎన్నికలకు…

కానీ పార్టీని నడిపించే వారు లేకపోవడం, నాయకత్వం అవసరం కావడంతో రాహుల్ గాంధీ ఎట్టకేలకు సుముఖత వ్యక్తం చేశారంటున్నారు. రాహుల్ గాంధీ 2024 ఎన్నికలకు సమాయత్తమవ్వాలని భావిస్తున్నారు. మధ్యలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల పర్యటనకు రాహుల్ గాంధీ సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.

రాష్ట్రాల పర్యటనలు….

దీంతో పాటు కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడా పొత్తులు పెట్టుకోకుండా పోటీ చేయాలన్నది కూడా రాహుల్ గాంధీ ఆలోచనగా ఉంది. అనేక రాష్ట్రాల్లో పొత్తుల కారణంగానే కాంగ్రెస్ ఎదగలేకపోతుందని భావిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సయితం ఒంటరిగానే పోటీ చేయనున్నారు. జూన్ నెల నుంచి రాహుల్ గాంధీ రాష్ట్రాల పర్యటనలు ఉంటాయని ఏఐసీసీ ముఖ్యుడొకరు వెల్లడించారు.

Tags:    

Similar News