రాహుల్ ను నమ్ముకోవడం కన్నా…?

నాయకుడన్నాక నేతల్లో నమ్మకం ఉండాలి. క్యాడర్ లో ధైర్యం కల్గించాలి. అయితే భవిష్యత్ నేతగా భావిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈ లక్షణాలు ఉన్నాయా? అంటే… [more]

Update: 2020-07-20 17:30 GMT

నాయకుడన్నాక నేతల్లో నమ్మకం ఉండాలి. క్యాడర్ లో ధైర్యం కల్గించాలి. అయితే భవిష్యత్ నేతగా భావిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈ లక్షణాలు ఉన్నాయా? అంటే… ఏమో డౌటుగానే ఉంది. ఆయన క్లిష్ట సమయాల్లో కాడి వదిలేసే రకం అన్న ముద్రపడిపోయింది. నాయకుడంటే తనను నమ్మకున్న వ్యక్తులకు పార్టీ పరంగా అండగా ఉండాలి. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఆ సమయంలో పత్తా లేకుండా పోతారన్న అపప్రధను ఎదుర్కొంటున్నారు.

ఇద్దరూ అత్యంత సన్నిహితులే….

జరిగింది మధ్యప్రదేశ్, రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాలైనప్పటికీ రాహుల్ గాంధీ పై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లలో ఇదే అభిప్రాయం నెలకొంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో జ్యోతిరాదిత్య సింధియా, రాజస్థాన్ లో సచిన్ పైలట్ లు ఇద్దరూ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులు. ఆయన కోటరీలో సభ్యులు. ఎంత నమ్మకంలేకపోతే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పట్లో వెస్ట్ ప్రాంతాన్ని జ్యోతిరాదిత్య సింధియాకు అప్పగిస్తారు. అత్యంత నమ్మకస్థుడైన జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడినప్పుడే రాహుల్ గాంధీ మౌనం వీడాల్సిందంటున్నారు.

క్లిష్ట సమయాల్లో…

ఇక తాజాగా సచిన్ పైలట్ కూడా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. నిజానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు పైలట్ కే అప్పగించాలని ఎన్నికల ఫలితాల తర్వాత నిర్ణయించారు. అయితే తల్లి సోనియా సూచనలతో ఆయన అశోక్ గెహ్లాత్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. అప్పడు కూడా సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ రెండు రాష్ట్రాలకు ఆ ఇద్దరినే పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ చేశారు. అలాంటి సచిన్ పైలట్ పార్టీని వీడటంతో రాహుల్ గాంధీ మరింత డల్ అయ్యారంటున్నారు. తాను ఏమీ చెప్పలేక, ఎటూ తేల్చుకోలేక ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు.

ఇలానే ఉంటే…..

అయితే రాహుల్ గాంధీ ఇలా చూస్తూ ఊరుకుంటూ కూర్చుంటే యువతలో నైరాశ్యం ఆవహించక మానదు. ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ ఉన్నాడన్న ఆశతో జెండా నమ్ముకున్న నేతలు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు సింధియా, పైలెట్ పరిస్థితి చూశాక యువనేతలు సీనియర్లదే కాంగ్రెస్ లో ఆధిపత్యం అని ఫీలవుతున్నారు. దీంతో భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీకి యువ నాయకత్వం కొరవడే ప్రమాదం ఉంది. ఉన్న వృద్ధనేతలతోనే కాంగ్రెస్ పార్టీ నెట్టుకు రావాల్సి ఉంటుంది. అందుకే రాహుల్ గాంధీ బ్యాక్ సీటు డ్రైవిండ్ వదలాలన్నది కాంగ్రెస్ లోని యువనేతల అభిప్రాయంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News