ఇకనైనా పగ్గాలు చేపట్టు సామీ?

రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టాలని మరోసారి వత్తిడి పెరుగుతోంది. ఆయన ఇంతవరకూ దానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు [more]

Update: 2020-11-05 16:30 GMT

రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టాలని మరోసారి వత్తిడి పెరుగుతోంది. ఆయన ఇంతవరకూ దానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు అధ్యక్ష పదవిలో ఉన్న సోనియా గాంధీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ మాత్రం ఉత్సాహంగా తిరుగుతున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొంటున్నారు. అలాగే పంజాబ్ రైతు ర్యాలీల్లో కూడా రాహుల్ చురుగ్గా పాల్గొన్నారు.

సోనియా ఇక కష్టమే……

సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె ఎక్కువ సమయం ఇకపై పార్టీకి కేటాయించలేరని చెబుతున్నారు. నిర్ణయాలన్నీ రాహుల్ గాంధీయే తీసుకోవాల్సి ఉంటుంది. అధ్యక్ష్య పదవి చేపడితే ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నట్లవుతుందని సీనియర్ నేతలు సయితం సూచిస్తున్నారు. సీనియర్ నేతలను గాడిలో పెట్టిన తర్వాత రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలను తీసుకుంటారని కొందరు చెబుతున్నారు.

రాహుల్ రాకకోసం…..

ఉత్తర్ ప్రదేశ్ లో హథ్రాస్ ఘటన తర్వాత రాహుల్ గాంధీ స్పందిచిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం దిగివచ్చేలా రాహుల్ చర్యలు ఉన్నాయని అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో గెలుపోటములను పక్కన పెట్టి రాహుల్ గాంధీ బాధ్యతలను స్వీకరించాలని ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశముంది.

కేరళ నేతల వత్తిడితోనైనా?

అందుకే కేరళ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై వత్తిడి తీసుకువస్తున్నారు. కేరళ రాష్ట్రాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉండటమే కాకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశముంది. అందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ ఇక్కడ ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. రాహుల్ గాంధీ మాత్రం ఇప్పటికీ ససేమిరా అంటున్నారు. మరి కేరళ నేతల వత్తిడికైనా తలొగ్గుతారో? లేదో? చూడాల్సి ఉంది.

Tags:    

Similar News