రజనీకాంత్ ఓటు బ్యాంకు ఎటు?

రజనీకాంత్ తమిళనాట ఆరాధ్య నటుడు. ఆయనకు తమిళనాడులో లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో లక్షలాది మంది రజనీకాంత్ అభిమానులు ఎటువైపు మొగ్గు చూపారన్నది ఆసక్తికరంగా [more]

Update: 2021-04-14 18:29 GMT

రజనీకాంత్ తమిళనాట ఆరాధ్య నటుడు. ఆయనకు తమిళనాడులో లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు తమిళనాడులో లక్షలాది మంది రజనీకాంత్ అభిమానులు ఎటువైపు మొగ్గు చూపారన్నది ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ రాజకీయాల్లోనూ ప్రభావం చూపగల వ్యక్తి. ఆయన ఒక పిలుపిస్తే ఓట్లు మొత్తం గంపగుత్తగా వచ్చి పడతాయి. అలాంటి రజనీకాంత్ ఈసారి తమిళనాడు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

పార్టీ పెట్టాలని…..

నిజానికి అన్నీ బాగుంటే రజనీకాంత్ ఈ ఎన్నికల్లోనే పార్టీ పెట్టి పోటీ చేయాల్సింది. పార్టీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తమిళనాడు వ్యాప్తంగా లక్షలాది మందిని సభ్యత్వం కూడా చేర్పించారు. జిల్లాల వారీగా నాయకులను కూడా నియమించారు. కానీ ఆయన ఒక్కసారిగా అనారోగ్యం పాలవ్వడంతో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనను విరమించుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు.

ఊపిరిపీల్చుకున్నా……

దీంతో తమిళనాడులోని ప్రధాన పార్టీలన్నీ ఊపిరిపీల్చుకున్నాయి. ప్రధానంగా డీఎంకే ఒకరకంగా సంబరాలు చేసుకుంది. అయితే రజనీ కాంత్ మద్దతు కోసం చివరి నిమిషం వరకూ అన్ని రాజకీయ పార్టీలూ ప్రయత్నించాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ రజనీకాంత్ ను మంచి చేసుకోవడం కోసం అనేక మార్గాల ద్వారా ప్రయత్నించింది. కానీ రజనీకాంత్ సున్నితంగా తిరస్కరంచారు. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలన్నది రజనీకాంత్ చెప్పలేదు.

ఎన్నికలకు ముందు…..

మరోవైపు ఎన్నికల వేళ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించి ఆయన అభిమానులను తన వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. ప్రతిష్టాత్మకమైన అవార్డు కావడంతో రజనీకాంత్ అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే ఎన్నికలకు ముందు ఇవ్వడంతో ఏ మేరకు వారు అన్నాడీఎంకే కూటమికి మద్దతిచ్చారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద రజనీకాంత్ ఓటు బ్యాంకు ఎటువైపు టర్న్ అయిందన్నది తమిళనాట ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News