రక్షణనిధికి ఎదురు దెబ్బ.. తలెత్తుకోలేక పోతున్నారా ?
కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి ఇప్పుడు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న తిరువూరు నియోజకవర్గంతో పాటు ఆయన [more]
కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి ఇప్పుడు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న తిరువూరు నియోజకవర్గంతో పాటు ఆయన [more]
కృష్ణా జిల్లా వైసీపీ సీనియర్ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి ఇప్పుడు తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న తిరువూరు నియోజకవర్గంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం పామర్రు పరిధిలోని రెండు మండలాల్లో పంచాయతీలను ఒంటి చేత్తో గెలిపిస్తానని మరీ ఆయన సీఎం జగన్‌కు చెప్పి వచ్చారు. అయితే ఆయన సొంత నియోజకవర్గంలోని మండలాల్లో వైసీపీకి ఎదురు దెబ్బ తప్పలేదు. ఆయన స్వగ్రామంలో సర్పంచ్ ఎన్నికను ఆయన ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా వైసీపీ ఓడిపోయింది. ఆయన సొంత మండలం తోట్లవల్లూరులో 16 పంచాయతీలు ఉన్నాయి. ముందుగానే వైసీపీకి 4 సర్పంచ్‌లు వైసీపీకి ఏకగ్రీవం అవ్వగా… ఎన్నికలు జరిగిన 12 పంచాయతీల్లో 8 చోట్ల వైసీపీ, 4 చోట్ల టీడీపీ విజయం సాధించాయి.
సొంత గ్రామంలోనే….
అయితే ఎమ్మెల్యే సొంత పంచాయతీ వల్లూరుపాలెంలో మాత్రం టీడీపీ విజయం సాధించింది. పైగా క్కడ నుంచే ఆయన సర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించడంతో పాటు పమిడిముక్కల మండల జెడ్పీటీసీగా కూడా పనిచేశారు. వల్లూరుపాలెం రక్షణనిధి పుట్టి పెరిగిన గ్రామ పంచాయతీ. ఇటీవల సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత పంచాయతీలు, మండలాలను తప్పక గెలిపించుకోవాలని సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు వరుసగా రెండుసార్లు గెలిచిన రక్షణనిధి మంత్రివర్గం రేసులో కూడా ఉన్నారు. అయినా సొంత పంచాయతీని కోల్పోవాల్సి రావడం ఆయనకు రాజకీయంగా ఇబ్బంది కరంగా మారింది. దీనిని ఆయన తీవ్ర అవమానంగానే భావిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా వైసీపీ…..
వల్లూరుపాలెంలో రక్షణనిధి బలపరిచిన వైసీపీ అభ్యర్థి మూరాల గంగమ్మపై టీడీపీ సానుభూతిపరురాలు కొనకాల రాజ్యలక్ష్మి విజయం సాధించారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఘోర పరాజయం చవిచూసినా.. ఇక్కడ మాత్రం విజయం సాధించడం వంటి పరిణామాలు రక్షణనిధికి ఇబ్బందిగా మారాయి. టీడీపీ శ్రేణులు మాత్రం దీనిని బాగా హైలెట్ చేయడంతో పాటు ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిలబెట్టిన వైసీపీ అభ్యర్థిని ఓడించామని సంబరాలు చేసుకుంటున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో మెజార్టీ సర్పంచ్‌లు గెలుచుకున్నా సొంత గ్రామంలో ఓటమిపాలుకావడం చర్చనీయాంశమైంది.