రమణ దీక్షితులది రామ బాణమేనట ?

రమణ దీక్షితులు. ఈయన పేరు నానుతూనే ఉంటుంది. తిరుమల దేవుని సన్నిధిలో గౌరవ ప్రధాన అర్చకత్వం నిర్వహిస్తున్న వైదిక పెద్ద. వంశపారంపర్య అర్చకత్వాని చంద్రబాబు ఒక్క కలం [more]

Update: 2020-08-20 12:30 GMT

రమణ దీక్షితులు. ఈయన పేరు నానుతూనే ఉంటుంది. తిరుమల దేవుని సన్నిధిలో గౌరవ ప్రధాన అర్చకత్వం నిర్వహిస్తున్న వైదిక పెద్ద. వంశపారంపర్య అర్చకత్వాని చంద్రబాబు ఒక్క కలం పోటుతో రద్దు చేస్తే ఆయన చేసిన పోరాటంతో జనం దృష్టిలో బాగా పడ్డారు. నాడు ఆయనకు జగన్ మద్దతు లభించింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన్ని తిరిగి పదవిలోకి తీసుకున్నారు. వంశపారంపర్య హక్కులను అర్చకులకు పునరుధ్ధరించారు. అయితే ఆయన ఎందుకో టీటీడీ వ్యవహరాల్లో ఇమడలేకపోతున్నట్లుగా ఉంది. లేక గతంలో న్యాయపోరాటం ద్వారా తనకు లభించిన ఆదరణను ద్రుష్టిలో ఉంచుకుని తరచూ వార్తల్లో ఉండాలనుకుంటున్నారో తెలియదు కానీ జగన్ మీద బాణాలు వేస్తూనే ఉన్నారు.

ఫెయిల్యూర్ ట…..

జగన్ సర్కార్ కరోనా కట్టడిలో ఫెయిల్ అయింది. ఎంతో మంది ఏపీలో రోజూ చనిపోతున్నారు. ఇది చంద్రబాబు మీడియా ముందుకొచ్చి జల్లుతున్న బురద. సరే బాబు విపక్షం కాబట్టి జగన్ మీద అలాగే మాట్లాడుతారు అనుకుంటే రమణ దీక్షితులు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. టీటీడీ అర్చకుల రక్షణ విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం వల్లనే కరోనాతో వారంతా చనిపోతున్నారని దారుణమైన కామెంట్ ని రమణ దీక్షితులు తాజాగా చేశారు. ఇక కరోనాతో చనిపోయిన అర్చకుల విషయంలోనూ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని కూడా రమణ దీక్షితులు విమర్శలు గుప్పించారు. ట్వీట్లు వేస్తూ జగన్ సర్కార్ మీద బాణాలు వేస్తున్న రమణ దీక్షితులు మరో వైపు ఇంటెరెస్టింగ్ గా బీజేపీకి మద్దతుగా మారుతున్నారన్న కామెంట్స్ వస్తున్నాయి.

మోడీ ఈజ్ గ్రేట్…..

ఈ మధ్య రమణ దీక్షితుల ట్వీట్లూ, రీట్వీట్లు అన్నీ కూడా బీజేపీ ఫాలోవర్స్ కి తెగ నచ్చేస్తున్నాయట. ఆయన కూడా బీజేపీ నేతల ట్వీట్లకు రీ ట్వీట్లు చేస్తున్నారు. దేశమంతా హిందూ రాజ్యం కావాలని అభిలషిస్తున్నారు. ప్రధాని మోడీ అయోధ్య రామాలయానికి శంఖుస్థాపన చేసిన తరువాత రమణ దీక్షితులు చేసిన ట్వీట్లు, ఆయన మోడీని ఆకాశానికెత్తేసిన విధానం చూస్తూంటే కాషాయం భావజాలం బాగా నచ్చేసినట్లుగా ఉందని అంటున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా రాజకీయ నాయకుల కబంధ హస్తాల నుంచి తప్పుకోవాలని కూడా రమణ దీక్షితులు అభిలషిస్తున్నారు. అది కూడా ఆయన బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

ఏం జరుగుతోంది ?

తిరుమల అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరాధించే అతి పెద్ద హిందూ ఆలయం. ఆధ్యాత్మిక ధామం. ఇపుడు తిరుమలలో అన్నీ సక్రమంగా జరగడంలేదని ఆరోపణలు వెల్లువెత్తితే అది చివరకు జగన్ సర్కార్ మెడకు చుట్టుకుంటుంది. నిజానికి జగన్ వచ్చి ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. అంతకు ముందు టీడీపీ హయాంలో కూడా రాజకీయ జోక్యం అతిగానే ఉండేది. కానీ జగన్ని క్రిస్టియన్ ట్యాగ్ లో ఇరికించి అక్కడ ఏదో అపరాధం జరుగుతోంది అని చెప్పడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోంది. రమణ దీక్షితులు మొదట్లో జగన్ అంటే అభిమానించేవారు. పోను పోనూ ఆయన వైఖరి పూర్తిగా యాంటీ జగన్, యాంటీ వైసీపీగా సాగుతోంది అంటున్నారు. ఇది ఎటు దారితీస్తుందోనన్న చర్చ కూడా వైసీపీలో జరుగుతోంది. జగన్ తానుగా చేయల్సిన న్యాయం టీటీడీకి చేస్తున్నారు. అయినా కోరి మరీ కొందరు విష ప్రచారానికి దిగుతూంటే పెద్ద మనిషిగా ఉండాల్సిన రమణ దీక్షితులు అందులోకి ఎందుకు వెళ్తున్నారన్నదే ఇక్కడ చర్చ.

Tags:    

Similar News