గడ్స్ ఉన్న లీడర్ గల్లీకి కూడా పనికి రావడం లేదే?

మంచి మనిషి అనే పేరుంది. అందరితో కలసి పోతారన్న గుర్తింపూ ఉంది. కానీ కాలం కలసి రావడం లేదు. లక్కు దరిదాపుల్లో కూడా కన్పించడం లేదు. దారీ [more]

Update: 2020-03-05 09:30 GMT

మంచి మనిషి అనే పేరుంది. అందరితో కలసి పోతారన్న గుర్తింపూ ఉంది. కానీ కాలం కలసి రావడం లేదు. లక్కు దరిదాపుల్లో కూడా కన్పించడం లేదు. దారీ తెన్నూ తెలియడంలేదు. నాడు జిల్లాను శాసించిన లీడర్ నేడు గల్లీకి కూడా పనికిరాకుండా పోయాడు. ఆయనే రమేష్ రాథోడ్. ఆదిలాబాద్ అంటేనే మొన్నటి వరకూ ముందుగా గుర్తొచ్చే పేరు రమేష్ రాథోడ్ దే. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా అనేక పదవులు అందించిన జిల్లా అది.

ఎన్నో పదవులను పొంది…

ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులను చేపట్టిన రమేష్ రాథోడ్ ది ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితం. తెలుగుదేశం పార్టీ నుంచి రమేష్ రాథోడ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ ఎంపీగా విజయం సాధించారు. తన భార్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. కిందిస్థాయి నుంచి రావడంతో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఇన్నాళ్లూ రాజకీయాలు సజావుగా నడిచాయి. అయితే 2014 రాష్ట్ర విభజన నాటి నుంచి ఆయన లక్కు వెనక్కు తన్నింది.

అనేక పార్టీలు మారి…..

2014 ఎన్నికల్లో రమేష్ రాథోడ్ టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అయితే టీఆర్ఎస్ లో కేవలం టిక్కెట్ కోసమే చేరారు. తనను, తన చరిత్ర చూసి టిక్కెట్ ఇస్తారని రమేష్ రాథోడ్ భ్రమపడ్డారు. అయితే కేసీఆర్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేసి ఖానాపూర్ లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగి అపజయాన్ని మూటగట్టుకున్నారు.

రాజకీయాల నుంచి …..

ఇప్పుడు ఆయనకు దారులు కన్పించడం లేదు. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన రమేష్ రాథోడ్ కు మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానంతో పాటు నాలుగు జిల్లాలుగా విడిపోయిన ఆదిలాబాద్ ప్రాంతంలో ఖానాపూర్, ఆసిఫాబాద్, బోధ్ నియోజకవర్గాలు మాత్రమే పోటీ చేసే వీలుంది. అయితే బోధ్ లో రమేష్ రాథోడ్ కు అంత పట్టులేదు. ఖానా పూర్ లో పట్టున్నా అదృష్టం కలసి రావడం లేుద. ఆసిఫాబాద్ లో కొంత బలమున్నా అక్కడ బలమైన నేతలు ఆత్రం సక్కు, కోవా లక్ష్మిలు ఉన్నారు. దీంతో ఒకప్పుడు కాలరెగేసి జిల్లా అంతా తిరిగిన నేత రమేష్ రాథోడ్ ఇప్పుడు తాను రాజకీయాల నుంచి విరమించుకుని తన కుమారుడు రితేష్ రాథోడ్ కు అప్పజెప్పేయాలనుకున్నారన్న టాక్ విన్పిస్తుంది. రితేష్ రాథోడ్ ను 2014 ఎన్నికల్లోనే ఖానాపూర్ అసెంబ్ల ీనుంచి టీడీపీ తరుపున పోటీ చేయించారు. అయితే రితేష్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో తర్వాత కామ్ అయ్యారు. మొత్తం మీద రమేష్ రాథోడ్ రాజకీయంగా తనకు తానే ముగింపు చెప్పేసుకున్నారన్న టాక్ అయితే ఉంది.

Tags:    

Similar News