ఒకే ఒక్కడు..ఇలా అయిపోయాడే

ఏపీలో మార్పు తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్ ఈ విష‌యంలో చాలా వ‌ర‌కు వెనుక‌బ‌డ్డార‌నే చె ప్పాలి. మార్పు తీసుకురావ‌డం అటుంచితే.. త‌న పార్టీ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం [more]

Update: 2019-10-27 00:30 GMT

ఏపీలో మార్పు తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన ప‌వ‌న్ ఈ విష‌యంలో చాలా వ‌ర‌కు వెనుక‌బ‌డ్డార‌నే చె ప్పాలి. మార్పు తీసుకురావ‌డం అటుంచితే.. త‌న పార్టీ ఉనికినే ప్ర‌శ్నార్థ‌కం చేసుకున్నారు. ఇదిలావుంటే, తాజాగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌ఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే విజ‌యం సాధించారు. ఆయ‌నే తూర్పు గోదావ‌రి జిల్లాలోని కాపు ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉన్న రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన రాపాక వ‌ర‌ప్ర‌సాద‌రావు. ఆయ‌న గ‌తంలో 2009లో కాంగ్రెస్ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఈయ‌న ఇప్పుడు రాజ‌కీయంగా వింత ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. 151 మందితో భారీగా విస్త‌రించిన వైసీపీ ప్ర‌భావం ముందు.. ఏకైక ఎమ్మెల్యేగా తాను ఇబ్బందులు ప‌డుతున్నాన‌ని ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

అభివృద్ధి పనులు….

మ‌రి ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది? ఎందుకు రాపాక‌లో ఇంత నిర్వేదం? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నా యి. ఇటు అధికార పార్టీని పొగ‌డ‌క‌పోతే.. నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌ర‌గ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అలాగ‌ని పొగిడితే.. ఇటు జ‌న‌సేనాని ప‌వ‌న్ వ‌ద్ద, కాపు సామాజిక వ‌ర్గం వ‌ద్ద కూడా రాపాక వరప్రసాద్ ఆగ్రహాన్ని ఎదు ర్కొంటున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక మాదిరిగా త‌యారైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొన్ని రోజుల కింద‌ట జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో అధికార పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌పై రాపాక ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. అయితే, ఈ ప‌రిణామం జ‌న‌సేన‌లో కుదుపున‌కు కార‌ణమైంది.

పాలాభిషేకంతో పీక్ కు….

అయినా.. ప‌రిస్థితులు త‌ప్ప‌డం లేద‌ని చెబుతున్న రాపాక‌.. వైఎస్సార్ వాహ‌న మిత్ర కార్య‌క్ర‌మం స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో మంత్రి పినిపే విశ్వ‌రూప్‌తో క‌లిసి జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశాడు. ఇది మ‌రింత సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో తాను జ‌న‌సేన ఎమ్మెల్యేనే అయిన‌ప్ప‌టికీ.. ఇలా గోడ‌మీద పిల్లిలా వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌డం లేద‌నేది రాపాక వరప్రసాద్ ఆలోచ‌న‌. ఇలా చేస్తేనే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు అయ్యే ప‌రిస్థితి ఉంద‌ని, లేక‌పోతే.. ఇబ్బందులేన‌ని అంటున్నారు. అయితే అదేస‌మ‌యంలోకాపు సామాజిక వ‌ర్గం నుంచి కొంతవ్య‌తిరేక‌త వ‌స్తోంది.

కీలక పదవుల్లోనూ…

ఈ విష‌యంలో ఆయ‌న ఇలా స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. మ‌రోప‌క్క‌, జ‌న‌సేన కీల‌క ప‌ద‌వుల్లోనూ రాపాక‌ వరప్రసాద్ కు చోటు లేదు. ఏకైక ఎమ్మెల్యే అయినా.. త‌న‌ను జ‌న‌సేనాని ప‌వ‌న్ ఎక్క‌డా ప‌ట్టించుకోవడం లేదు. కీల‌క ప‌ద‌వుల‌ను ఓడిపోయిన నేత‌ల‌కు క‌ట్ట‌బెడుతున్నారే త‌ప్ప‌.. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆవేద‌న రాపాక వరప్రసాద్ లో స్ప‌ష్టంగా ఉంది. అయినా కూడా ఆయ‌న మౌనంగా భ‌రిస్తున్నారు. పోనీ.. జ‌గ‌న్‌ను విమ‌ర్శి ద్దామా? అంటే.. ఇప్ప‌టికే ఆయ‌న‌పై న‌మోదైన కేసు స‌హా.. ఇత‌ర అంశాలు వంటివి ఇబ్బంది పెడ‌తాయేమోన‌ని భావిస్తున్నారు.

పార్టీ నేతలందరూ….

ఇక త‌న గెలుపులో స‌హ‌క‌రించిన రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజుతో పాటు ప‌లువురు జ‌న‌సేన కీల‌క నేత‌లు ఇటీవ‌ల వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇటీవ‌ల రాపాక జ‌గ‌న్ ఫొటోకు పాలాభిషేకం చేశారో లేదో వెంట‌నే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆయ‌న కౌటౌట్లు తీసేసి… ప‌వ‌న్‌వి మాత్ర‌మే ఉంచారు. తాము గెలిపిస్తే జ‌గ‌న్‌ను పొగ‌డ‌టం ఏంట‌ని నియోజ‌క‌వ‌ర్గ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఇలా.. మొత్తంగా రాపాక ప‌రిస్థితి క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కి, విడ‌వ‌మంటే పాముకి కోపంగా ఉన్న‌ట్టు మారిపోయింది.

Tags:    

Similar News