డిస్కో రాజా మూవీ రివ్యూ
బ్యానర్: SRT ఎంటరైన్మెంట్స్ నటీనట నటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ సింహా, తాన్యా హోపే,సునీల్ ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని [more]
బ్యానర్: SRT ఎంటరైన్మెంట్స్ నటీనట నటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ సింహా, తాన్యా హోపే,సునీల్ ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని [more]
బ్యానర్: SRT ఎంటరైన్మెంట్స్
నటీనట నటులు: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ సింహా, తాన్యా హోపే,సునీల్
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్ థమన్
నిర్మాత: రామ్ తాళ్లూరి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి ఐ ఆనంద్
రాజా ధీ గ్రేట్ తర్వాత మళ్ళి హిట్ కొట్టలేకపోయిన.. మాస్ రాజా రవితేజకి నెల టికెట్, టచ్ చేసి చూడు రెండు సినిమాలు భారీ షాకిచ్చాయి. ఆ తర్వాత భారీ గ్యాప్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల్తో ఆకట్టుకున్న వి ఐ ఆనంద్ తో డిస్కో రాజా అంటూ ఓ పక్కా కమర్షిల్ మూవీ చేసాడు. ఆ మూవీ పై మొదటినుండి అంచనాలున్నాయి. అయితే పరమ రొటీన్ సినిమాల్తో బోర్ కొట్టిస్తున్న రవితేజ, వి ఆనంద్ తో కలిసి ఈ సినిమాలో ఏం చూపించాడా అనే ఆసక్తి ఉంది. ఇక హాట్ గర్ల్స్ పాయల్ రాజ్ ఫుట్, నాభ నటేష్ హీరోయిన్స్ గా నటించడం, రవితేజ కాన్ఫిడెన్స్ అన్ని సినిమాపై ఆసక్తిని పెంచాయి. అందుకే డిస్కో రాజా ట్రైలర్ కూడా వదలకుండా రవితేజ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి డిస్కో రాజాపై రవితేజ కాన్ఫిడెన్స్ ఎంతవరకు పనిచేసింది? రవితేజకి ఈ సినిమా హిట్ ఇచ్చిందా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
వాసు (రవితేజ) అనే అనాధ తనని చేరదీసి.. తనతో పాటుగా ఇంకొంతమంది అనాధలకు ఆశ్రమం కల్పించిన పెద్దాయన్ని మోసం చేసి డబ్బు కొట్టేసిన ఆయన కొడుకుని పట్టుకోవడానికి వెళ్తాడు. అలా వెళ్లిన వాసు రోజులు గడుస్తున్నప్పటికీ తిరిగి రాడు. మరోవైపు కశ్మీర్‌లో మంచులో కూరుకుపోయిన డిస్కో రాజా శవం దొరుకుతుంది. చనిపోయిన మనుషుల్లో మళ్ళీ జీవం పోసి బతికించడానికి ఎప్పటినుంచో రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్) కారణంగా డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. మరోపక్క వాసు (రవితేజ) కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. చనిపోయిన వ్యక్తిని బతికించే పరిశోధనలు చేస్తోన్న ఈ కంపెనీ.. చట్ట విరుద్ధంగా తమ ప్రయోగానికి డిస్కో రాజా పై చేయడంతో మళ్ళి బ్రతుకుతాడు. మరి వాసు నే డిస్కో రాజనా? అసలు డిస్కో రాజా కథ ఏమిటి? ఇంట్లో నుంచి వాసుగా బయటికి వచ్చిన వ్యక్తి డిస్కోరాజా ఎలా అయ్యాడు? అసలు డిస్కో రాజాని ఎవరు చంపారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
రవితేజ ఏనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో కూడా బాగా ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా కూడా గత తన సినిమాలలో కంటే.. ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. ముఖ్యంగా కొన్ని గ్యాంగ్ స్టర్ సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అసలు సినిమా మొత్తాన్ని రవితేజ తన భుజస్కందాలపై నడిపించాడు. మాస్ మహారాజాలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండుగలా ఉంటుంది. ఇక హీరోయిన్ కి పెద్దగా స్కోప్ లేదు. నాభ నటేష్, పాయల్ రాజపుట్ స్క్రీన్ స్పేస్ చాల తక్కువ. నభా నటేష్ పాత్ర అయితే ఎందుకు అనిపిస్తుంది. పాయల్ రాజ్‌పుత్ పాత్ర కొంతలో కొంత నయం. మూగ అమ్మాయిగా చక్కగా నటించింది. ఇక తాన్య హోప్ డాక్టర్ పాత్రలో మెప్పించింది. వెన్నెల కిషోర్ కామెడీగా ఆకట్టుకున్నాడు. ఇక సునీల్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. కాకపోతే కమెడియన్‌గా, హీరోగా చూసిన సునీల్‌ను క్రూరంగా చూడటానికి ప్రేక్షకుల మనసు అంగీకరించకపోవచ్చు. ఇక మిగిలిన బాబీ సింహా, వీకే నరేష్, సత్య మిగతా నటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
దర్శకుడు వి ఐ ఆనంద్ తెరకెక్కిన్చే సినిమా కథలు కాస్త రొటీన్ కి భిన్నంగా అనిపిస్తాయి. రవితేజ తో చేసిన డిస్కో రాజా సినిమా కథకు సైన్స్ ఫిక్షన్‌ను జోడించి కొత్తదనం తీసుకొచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు. సైంటిఫిక్ రీజన్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిద్దామని దర్శకుడు వీఐ ఆనంద్ చేసిన ప్రయోగం బాగానే అనిపిస్తుంది. సినిమా స్టార్టింగ్ లోనే ఆసక్తికర నరేషన్ తో మొదలుపెట్టాడు దర్శకుడు. అంతే కాకుండా తాము ఎంచుకున్న పాయింట్ కూడా చాలా వినూత్నంగా ఉండడమే కాకుండా దానిని తెరకెక్కించిన విధానం ఖచ్చితంగా సినిమా చూసే ప్రేక్షకులను థ్రిల్ చెయ్యక మానదు. కాకపోతే సినిమా చాల స్లో గా మొదలవ్వడం ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమా మొదలుపెట్టాక ఓ గంట తర్వాత కానీ ప్రేక్షకుడికి అసలు కథేంటో అంతు చిక్కదు. ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అక్కడి నుంచి ప్రేక్షకుడికి ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్ లోనే వింటేజ్ లుక్ లో రవితేజ ఎనర్జీ కానీ అదే ఊపులో వచ్చే ఫ్రీక్ అవుట్ సాంగ్ కానీ సూపర్బ్ గా అనిపిస్తాయి. దానితో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరుగుతాయి. అయితే సెకెండ్ హాఫ్ లో మొదటి ముప్పై నిముషాల్లో వచ్చే డిస్కో రాజా తాలూకు సన్నివేశాలు ఇంకా ఇంట్రస్ట్ గా ఉంటే బాగుండేది. హీరో అండ్ విలన్ల మధ్యన వచ్చే ఘర్షణ తాలూకు సన్నివేశాలు అలాగే సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో నడిచిన ఆసక్తికర కథనం పూర్తిగా మారినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ ఎంగేజింగ్‌గా లేదు. సాగదీతలా అనిపిస్తుంది. సెకండాఫ్ మొత్తం నీరసంగా సాగినా… క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. దర్శకుడు స్క్రీన్‌ప్లేపై మరింత దృష్టిపెట్టి కథను ఎంగేజింగ్‌గా చూపించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.
సాంకేతికంగా..
ఈ సినిమాలో థమన్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. మెయిన్ గా డిస్కో రాజా సాంగ్ అదిరిపోయింది. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతుంది. ఇక సినిమాకి మెయిన్ హైలెట్ అంటే సినిమాటోగ్రఫీనే. సినిమాలో దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. కార్తీక్ ఘట్టమనేనిని మెచ్చుకోకుండా ఉండలేం. ఆయన కెమెరా పనితనం అంత అద్భుతంగా ఉంది. ముఖ్యంగా లదాఖ్, ఐస్‌ల్యాండ్‌లోని మంచు కొండలను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఇక ఎడిటర్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉండాలి. కథానుసారం నిర్మాణవిలువలు ఉన్నాయి.
రేటింగ్: 2.25/5