Congress : రేవంత్ ఇక్కడ దొరికిపోతారా?
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మామూలే. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకుండా నిత్యం వివాదాలతో సతమతమయ్యే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ [more]
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మామూలే. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకుండా నిత్యం వివాదాలతో సతమతమయ్యే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ [more]
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మామూలే. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండకుండా నిత్యం వివాదాలతో సతమతమయ్యే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి ఎంపికయిన తర్వాత విభేదాలు నేతల మధ్య మరింత ముదిరాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు పెద్దగా అసమ్మతి కన్పించ లేదు. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన నెలలు గడవకముందే పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి పెరిగిందని చెప్పాలి.
సీనియర్ నేతలు….
ఇప్పటికే సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి వైఖరి పట్ల కినుకతో ఉన్నారు. పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వివిధ కార్యక్రమాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడికక్కడ మోకాలడ్డటుండటంతో ఆయన కూడా విసిగిపోయినట్లు కన్పిస్తుంది.
సహకార నిరాకరణ….
రేవంత్ రెడ్డికి సీనియర్ నేతల సహకారం కూడా కొరవడింది. ఇటీవల ఆయన ఇంటిపై టీఆర్ఎస్ క్యాడర్ దాడులు చేసినప్పుడు ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఆయనకు మద్దతు పలకలేదు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగే అవకాశముంది. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పార్టీది మూడో స్థానమే. ఇక్కడ డిపాజిట్లు దక్కించుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
ఉప ఎన్నిక తర్వాత….
మొన్నటి వరకూ కాంగ్రెస్ నేతలు ఇక్కడ కనీసం పర్యటనలు కూడా చేయలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రేవంత్ రెడ్డికి నేతల నుంచి సహాయ నిరాకరణ మరింత పెరిగే అవకాశముంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అనేకమంది సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు. హుజూరాబాద్ ఫెయిల్యూర్ ను రేవంత్ రెడ్డిపైనే వేసేందుకు వారు ఈ స్ట్రాటజీని ఎంచుకున్నట్లే కన్పిస్తుంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి నాయకత్వానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక సవాల్ గా మారనుంది.