Congress : మొత్తం పాపం రేవంత్ దేనట

తెలంగాణలో కాంగ్రెస్ ఇక కోలుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ హుజూరాబాద్ లో ఘోర పరాజాయం పాలయింది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ [more]

Update: 2021-11-03 11:00 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ఇక కోలుకోలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ హుజూరాబాద్ లో ఘోర పరాజాయం పాలయింది. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఇక్కడ మూడు వేల ఓట్లు వస్తే, అదే రాష్ట్ర విభజన చేసిన ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థికి ఆరు వేల ఓట్లు వచ్చాయి. అంటే తెలంగాణ కాంగ్రెస్ దైన్య స్థితిని ఇది చెప్పకనే చెబుతుంది. కనీస పనితీరును హుజూరాబాద్ లో చూపించకపోవడంపై కాంగ్రెలో అంతర్మధనం జరుగుతుంది.

అంతా ఆలస్యమే….

కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఎప్పడూ ఉండేవే. కానీ ఎన్నికల సమయంలోనైనా వాటిని వదిలేసి పనిచేయాల్సిన నేతలు సహాయ నిరాకరణకు దిగారు. దీంతో పాటు తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో నిర్లక్ష్యం చేసిందనే చెప్పాలి. కొద్దిరోజులు కొండా సురేఖ అభ్యర్థి అని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై కమిటీని వేశారు. కొండా సురేఖ కాదనడంతో నామినేషన్లకు ముందు రోజు అభ్యర్థిని ఖరారు చేశారు.

వాళ్లు ముందు నుంచే…

బీజేపీ, టీఆర్ఎస్ ఈటల రాజీనామా చేసిన రోజు నుంచి హుజూరాబాద్ లో ప్రచారాన్ని ప్రారంభించాయి. బీజేపీకి అభ్యర్థి ఎటూ ఈటలే కాబట్టి ఆయన అక్కడే మకాం వేశారు. ఇక టీఆర్ఎస్ సయితం అభ్యర్థిని ముందుగానే నిర్ణయించింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ విషయంలో పెద్ద తప్పిదం చేసిందన్న కామెంట్స్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. కనీస ఓట్లు సాధించకపోవడంపై పార్టీ సీనియర్లు సయితం నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

రేవంత్ టార్గెట్ గా….

ఎప్పుడు వీలు చిక్కుతుందా? అని కాచుకు కూర్చుని ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి సాగర్, దుబ్బాకలో పనిచేసినట్లు ఇక్కడ నేతలు పనిచేయలేదన్నారు. పొన్నం ప్రభాకర్ సయితం ఇక్కడ కోవర్టు ఆపరేషన్ జరిగిందని అభిప్రాయపడ్డారు. జగ్గారెడ్డి అయితే ఏకంగా ఇది నాయకత్వ వైఫల్యమేనని అన్నారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా నేతలు అధినాయకత్వానికి ఇక్కడి ఫెయిల్యూర్ పై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ పూర్ ఫెర్మార్మెన్స్ భవిష్యత్ కు దిక్సూచీ వంటిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి

Tags:    

Similar News