Sameer wankhede : నిజాయితీకి ఇదే బహుమానమా?
సమీర్ వాంఖడే చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? డ్రగ్స్ కేసులో 25 కోట్ల లంచం అడిగారన్న ఆరోపణలు ఆయనను చుట్టుముడుతున్నాయి. సమీర్ వాంఖడే కు ఇప్పటి వరకూ నిజాయితీ [more]
సమీర్ వాంఖడే చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? డ్రగ్స్ కేసులో 25 కోట్ల లంచం అడిగారన్న ఆరోపణలు ఆయనను చుట్టుముడుతున్నాయి. సమీర్ వాంఖడే కు ఇప్పటి వరకూ నిజాయితీ [more]
సమీర్ వాంఖడే చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? డ్రగ్స్ కేసులో 25 కోట్ల లంచం అడిగారన్న ఆరోపణలు ఆయనను చుట్టుముడుతున్నాయి. సమీర్ వాంఖడే కు ఇప్పటి వరకూ నిజాయితీ అధికారిగా పేరుంది. అనేక డ్రగ్స్ కేసులను ఆయన సులువుగా ఛేదించారు. నిందితులను ఊచలు లెక్కపెట్టేలా చేశారు. సమీర్ వాంఖడే ను మానసికంగా దెబ్బతీసేందుకు పెద్ద స్థాయిలో కుట్ర జిరిగిందా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
నిజాయితీ కలిగిన అధికారిగా….
సమీర్ వాంఖడే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి వచ్చారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారిగా పనిచేశారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ అధికారిగా పనిచేస్తున్నారు. 2008 బ్యాచ్ కు చెందిన సమీర్ వాంఖడే ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ లో డిప్యూటీ కస్టమ్స్ అధికారిగా పనిచేశారు. డ్రగ్స్ కేసులో ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూడా విచారణ జరిపారు. ఇప్పటి వరకూ ఆయన ఉద్యోగ జీవితంలో ఎలాంటి మచ్చ పడలేదు.
సాక్షి చేసిన ఆరోపణలతో…
ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పట్టుబడటం, బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చిక్కడంతో ఈయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోయింది. ఇప్పుడు ఆయనపైనే సొంత సంస్థ విచారణ చేపట్టింది. మహారాష్ట్రలో తమ ప్రభుత్వాన్ని అస్థిర పర్చడానికి డ్రగ్స్ కేసును కేంద్రం వాడుకుంటుందని, సమీర్ వాంఖడే కేంద్రం పెద్దలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని శివసేన ఆరోపిస్తుంది. ఎన్సీపీ సయితం సమీర్ వాంఖడే తీరును ఎన్సీపీ కూడా తప్పపపట్టింది. శివసేన ఏకంగా అతనికి మతం అంటగట్టింది.
కావాలనే టార్గెట్ చేశారా?
ఒక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ దొరికి ఉండవచ్చు. ఆయనకు నిజంగా డ్రగ్స్ కేసులో సంబంధం లేకపోతే న్యాయస్థానం నుంచి బయటపడే వీలుంది. కానీ ఒక దర్యాప్తు అధికారి, నిజాయితీగా పేరున్న సమీర్ వాంఖడే ను కొందరు కావాలని టార్గెట్ చేశారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. నిందితులు కూడా అన్ని రకాలుగా బలవంతులైన వ్యక్తులు కావడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తం మీద ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా సమీర్ వాంఖడే కు కూడా చుట్టుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.