ఈ మంత్రి జమానా ఇక ముగిసినట్లే

ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశం.. అనేక విష‌యాల‌కు సంచ‌ల‌నంగా మారింది. మంత్రులు త‌మ మ‌న‌సులోని ఆవేద‌న‌ను, త‌మ స‌మ‌స్యల‌ను జ‌గ‌న్‌తో స్వయంగా చెప్పుకొన్నార‌ని తెలుస్తోంది. ఆఫ్‌ది [more]

Update: 2020-12-12 12:30 GMT

ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ కేబినెట్ స‌మావేశం.. అనేక విష‌యాల‌కు సంచ‌ల‌నంగా మారింది. మంత్రులు త‌మ మ‌న‌సులోని ఆవేద‌న‌ను, త‌మ స‌మ‌స్యల‌ను జ‌గ‌న్‌తో స్వయంగా చెప్పుకొన్నార‌ని తెలుస్తోంది. ఆఫ్‌ది రికార్డుగా కొంద‌రు వైసీపీ నాయ‌కులు చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టి.. కొంద‌రు మంత్రులు నేరుగా జ‌గ‌న్‌కే త‌మ స‌మ‌స్యలు చెప్పుకొన్నార‌ట‌. తాము త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో, జిల్లాల్లో ఎదుర్కొంటున్న స‌మ‌స్యలు, త‌మ‌కు ఎలాంటి స‌మ‌స్యలు ఉన్నాయో.. జ‌గ‌న్‌కు వెల్లడించార‌ట‌. వీరిలో కొంద‌రు చెప్పకుండానే జ‌గ‌న్ వారి స‌మ‌స్యలు త‌న‌కు తెలుసున‌ని.. ఊర‌డించే ప్రయ‌త్నం చేయ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం ఆయ‌న ఎంత ఊర‌డించినా.. కూడా త‌మ స‌మ‌స్యలు చెప్పుకొన్నార‌ట‌.

సొంత పార్టీ నేతలే….

అనంత‌పురం జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంక‌ర‌నారాయ‌ణ జ‌గ‌న్ ద‌గ్గర అనేక స‌మ‌స్యల‌ను మొర‌పెట్టుకున్నట్టు భోగ‌ట్టా. నియోజ‌క‌వ‌ర్గంలో తాను అడుగు పెట్టలేని ప‌రిస్థితి ఏర్పడింద‌ని.. కొంద‌రు సొంత పార్టీ నాయ‌కులే.. త‌న‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని.. త‌న‌ను ప‌నికూడా చేసుకోనివ్వకుండా అడుగ‌డుగునా ఇబ్బంది పెడుతున్నార‌ని జ‌గ‌న్ వ‌ద్ద ప్రస్తావించార‌ని తెలిసింది. “ సార్ నా ప‌రిస్థితి దారుణం. మీరే ఏదో ఒకటి చేయాలి “ అని శంక‌ర‌నారాయ‌ణ చెప్పడంతో.. జ‌గ‌న్ కొంచెం సేపు ఆలోచ‌న‌లో ప‌డిపోయార‌ని మొన్న కేబినెట్ స‌మావేశం త‌ర్వాత ఒక్కటే చ‌ర్చ బ‌య‌ట న‌డిచింది.

ప్రజల్లో వ్యతిరేకత…..

వాస్తవానికి మంత్రుల విష‌యంలో త‌న‌కు అన్నీ తెలుసు అనే జ‌గ‌న్‌.. ఒక్క శంక‌ర నారాయ‌ణ విష‌యంలో మాత్రం సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు. నిజానికి అనంత‌పురంలో శంక‌ర‌నారాయ‌ణ‌కు వ్యతిరేకంగా కొన్నాళ్లుగా సొంత పార్టీ నేత‌లే చ‌క్రం తిప్పుతున్నారు. దీనికి కార‌ణాలు ఏవైనా.. మంత్రికి మాత్రం బాగానే సెగ‌త‌గులుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఇటీవ‌ల మంత్రి ప‌ర్యటించిన‌ప్పుడు.. తీవ్ర వ్యతిరేక‌త వ‌చ్చింది. ఆయ‌న కాన్వాయ్‌ను సైతం రైతులు అడ్డగించారు. మంత్రిగా ఉండి కూడా త‌మ‌కు చుక్క నీరు కూడా అందించ‌లేక పోతున్నారంటూ వారు ఆందోళ‌న చేప‌ట్టారు.

జగన్ కూడా…..

అయితే.. ఇప్పటి వ‌ర‌కు లేని ప‌రిస్థితి ఒక్కసారిగా త‌లెత్తడం వెనుక త‌న‌కు వ్యతిరేకంగా చ‌క్రం తిప్పుతున్నవారు.. ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్లే తాను ఇంత‌లా టార్గెట్ అవుతున్నాన‌ని శంక‌ర‌నారాయ‌ణ ఆందోళ‌న వ్యక్తం చేసిన‌ట్టు స‌మాచారం. అయితే.. మొత్తం విన్న జ‌గ‌న్ మాత్రం ఎలాంటి స‌మాధానం చెప్పక‌పోగా.. న‌వ్వుతూ సాగ‌నంపార‌ని అంటున్నారు. క‌ట్ చేస్తే మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న‌లో శంక‌ర‌నారాయ‌ణ‌కు ఉద్వాస‌న త‌ప్పద‌నే వ్యాఖ్య‌లు కొన్నాళ్లుగా వినిపిస్తోంది. జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు శంక‌ర నారాయ‌ణ‌ను ముప్పుతిప్పలు పెడుతోన్న ప‌రిస్థితి ఉంద‌ని ఆయ‌న కొద్ది రోజులుగా మొత్తుకుంటున్నా ఆయ‌న్ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి ఉన్నట్టు లేదు.

Tags:    

Similar News