బెట్టు చేయమంటూనే….!!!
కర్ణాటకలో జనతాదళ్ ఎస్, భారత జాతీయ కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరేటట్లే కన్పిస్తున్నా సీట్ల పంపకాల మధ్య మాత్రం తేడాలు వచ్చేటట్లే ఉంది. మాజీ ప్రధాని, [more]
కర్ణాటకలో జనతాదళ్ ఎస్, భారత జాతీయ కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరేటట్లే కన్పిస్తున్నా సీట్ల పంపకాల మధ్య మాత్రం తేడాలు వచ్చేటట్లే ఉంది. మాజీ ప్రధాని, [more]
కర్ణాటకలో జనతాదళ్ ఎస్, భారత జాతీయ కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదిరేటట్లే కన్పిస్తున్నా సీట్ల పంపకాల మధ్య మాత్రం తేడాలు వచ్చేటట్లే ఉంది. మాజీ ప్రధాని, జనతాదళ్ ఎస్ అధినేత హెచ్,డి.దేవెగౌడ తాము సీట్ల కోసం పట్టు పట్టమని చెప్పడంతో కాంగ్రెస్ వర్గాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ కు కూడా ఆయన పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెస్ కూడా పట్టువిడుపు ధోరణని ప్రదర్శించాలన్న ఆయన వ్యాఖ్యల వెనక ఆంతర్యాన్ని అంచనా వేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ నేతలు.
ఆ సంఖ్య కాకపోయినా…..
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లు వచ్చే లోక్ సభ ఎన్నికల్ల కలసి పోటీ చేయాలనే నిర్ణయించుకున్నాయి. మొత్తం 28 లోక్ సభ స్థానాల్లో జనతాదళ్ ఎస్ నిన్న మొన్నటి వరకూ 12 స్థానాలను కొంచెం గట్టిగానే కోరింది. కాంగ్రెస్ మాత్రం పన్నెండు స్థానాలను జేడీఎస్ కు ఇచ్చేందుకు సుముఖంగా లేదు. వచ్చే ఎన్నికలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవిని అధిష్టించడానికి కీలకం కావడంతో అధిక స్థానాలను కాంగ్రెస్ సహజంగానే కోరుకుంటుంది.
సర్వేల ద్వారానే…..
చివరకు జనతాదళ్ ఎస్ పన్నెండు స్థానాల నుంచి తొమ్మిది స్థానాలకు దిగి వచ్చింది. తొమ్మిది స్థానాలను ఇచ్చేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుముఖంగా లేరు. అనేక పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడే ఇందుకు కారణమని ఆయన చెబుతున్నారు. ఇందుకు ఆయన మధ్యే మార్గంగా ఒక ప్రతిపాదన జనతాదళ్ ఎస్ నేతల ముందుంచారు. గెలిచే స్థానాలనే తీసుకోవాలని, ఇందుకు సర్వేలు చేయించాలన్నది ఆయన అభిప్రాయం.
ప్రాతిపదిక ఏంటి?
అయితే సర్వేలు ఏ ప్రాతిపదికన ఉంటాయి? అక్కడ అభ్యర్థులు ఎవరు? ప్రత్యర్థి ఎవరు? అన్న దానిపైన కూడా సర్వేల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది జనతాదళ్ ఎస్ వర్గాల అనుమానం. అలా కాకుండా తమకు పట్టున్న, ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాలను ఇవ్వాలన్నది జనతాదళ్ ఎస్ డిమాండ్. దీనికి ఒక ప్రాతిపదిక అంటూ ఏమీ లేదంటున్నారు మరికొందరు. రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే, రెండు పార్టీల క్యాడర్ లు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే విజయం తథ్యమన్నది కాంగ్రెస్ నేతల వాదన. ఇలా కర్ణాటకలో సీట్ల పంపకాలపై పీటముడి ఇంకా కొనసాగుతూనే ఉంది.