వెళ్లలేక….ఉండలేక…?
టీడీపీ నేతల్లో అంతర్మథనం సాగుతోంది. పార్టీలో ఉండాలా? బయటకు రావాలా ? అని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇలా ఒకటో రెండో జిల్లాల్లో కాదు. రాష్ట్రంలోని [more]
టీడీపీ నేతల్లో అంతర్మథనం సాగుతోంది. పార్టీలో ఉండాలా? బయటకు రావాలా ? అని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇలా ఒకటో రెండో జిల్లాల్లో కాదు. రాష్ట్రంలోని [more]
టీడీపీ నేతల్లో అంతర్మథనం సాగుతోంది. పార్టీలో ఉండాలా? బయటకు రావాలా ? అని నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఇలా ఒకటో రెండో జిల్లాల్లో కాదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపి స్తోందని అంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. చాలా జిల్లాల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. దీంతో కార్యకర్తలు కకావికలం అయిపోయారు. ఫలితంగా టీడీపీ జెండా మోసే కార్యకర్తలు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇక, నాయకుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. పార్టీ పుంజుకుంటుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వారసులను రంగంలోకి తీసుకువచ్చి తమ హవా చాటుకుందామని అనుకున్నవారికి కూడా గత ఎన్నికలు చుక్కలు చూపించాయి.
వెనక్కు లాగుతుంది…..
దీంతో ఇంకా ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నా.. మళ్లీ పూర్వవైభవం వచ్చే ఛాన్స్ లేకపోవడంతో నాయకులు, వారి వారసులు కూడా తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే, ఒకపక్క అంతా అయి పోయిందని అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఏదో ఒక ఉద్యమం పేరుతో మళ్లీ ప్రజల్లోకి వస్తుండడంతో పార్టీ పుంజుకుంటుందేమో చూద్దాంమనే ఆలోచన నాయకులను మళ్లీ వెనక్కి లాగుతోంది. దీంతో పార్టీ నేతల మధ్య ఈ విషయం అంతర్మథనంగా మారింది. అనంతపురం జిల్లాలో కీలక నాయకులు పరిటాల వర్గం పార్టీకి ఎంతో సేవ చేసింది. పదవులు కూడా అనుభవించింది. అయితే, గత ఎన్నికల్లో వారసుడి అరంగేట్రం బెడిసి కొట్టింది.
ఉద్యమాలు ఊపందుకోవడంతో….
దీంతో ఇక టీడీపీలో ఉండరాదని నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే, మళ్లీ పార్టీ ఉద్యమాలతో ఎటూ తేల్చుకోలేక ఉండిపోయారని సమాచారం. అదేవిధంగా జేసీ వర్గం కూడా టీడీపీ నుంచి బయటకు రావాలని అనుకుంటున్నారు. కానీ, చంద్రబాబు నుంచి వస్తున్న రిక్వెస్ట్‌లతో ఆగిపోతున్నారు. అయితే, ఇలా ఎంతకాలం వారు టీడీపీలో కొనసాగుతారో తెలియని పరిస్థితి. కర్నూలులోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారు ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక, ప్రకాశంలో పార్టీ నుంచి దూకేందుకు రెడీ అయిన నాయకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
కీలక నేతలు సయితం…
గుంటూరులో టీడీపీలోనే నేతలు ఉన్నా..కష్టంలో ఉండగా తమను ఆదుకోవడం లేదని పార్టీ అధినేతపై యరపతినేని శ్రీనివాసరావు వంటి వారు అసంతృప్తితో ఉన్నారు. అయితే, వీరికి టీడీపీ తప్ప మరో మార్గం లేదని అంటున్నారు. అదే సమయంలో కృష్ణాలో ఇప్పటికే ఒకరు జంప్ చేశారు. మరో ఇద్దరు రెడీగా ఉన్నా రని వార్తలు వస్తున్నాయి. పశ్చిమలో ఒకరి మరణం, మరో కీలక నేత అనారోగ్యంతో టీడీపీ పరిస్థితి అగమ్యంగా ఉంది. ఉత్తరాంధ్రలోనూ పార్టీ పరిస్థితి నానాటికీ గండంగానే గడుస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఎలా మారుతుందో? తమ భవితవ్యం ఏమవుతోందనని పార్టీలోని సీనియర్లు తర్జన భర్జన పడుతున్నారు. వెళ్లలేక.. ఉండలేక ఇబ్బంది పడుతున్నారు.