వచ్చే ఎన్నికల నాటికి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో ఉండరట

దళితులపై దాడులు జరుగుతున్నాయని, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతిపక్షం పదే పదే ఆరోపిస్తుంటుంది. దళితులకు తాము ఇచ్చిన ప్రాధాన్యత మరెవ్వరూ ఇవ్వరని అధికార పక్షం [more]

Update: 2020-10-17 05:00 GMT

దళితులపై దాడులు జరుగుతున్నాయని, వారి సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతిపక్షం పదే పదే ఆరోపిస్తుంటుంది. దళితులకు తాము ఇచ్చిన ప్రాధాన్యత మరెవ్వరూ ఇవ్వరని అధికార పక్షం డప్పాలు కొట్టుకుంటుంది. ఎవరు అధికారంలో ఉన్న దళితుల సంగతి పక్కన పెడితే అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నాయని చెప్పాలి. ఎస్సీ నియోజకవర్గాలు మారవు. అక్కడ ఎమ్మెల్యేలు మారుతారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా దళిత ఎమ్మెల్యే అక్కడి అగ్రవర్ణాల చేతుల్లో ఉండాల్సిందే.

ఏ మాత్రం స్వతంత్రంగా వ్యవహరించినా….

వారి మాట కాదని ఏమాత్రం స్వతంత్రంగా వ్యవహరించినా వారికి ఇక చుక్కలు కన్పించినట్లే. చంద్రబాబు అధికారంలో ఉండగా గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న రావెల కిశోర్ బాబును అక్కడి అగ్రవర్ణాలు మంత్రి వర్గం నుంచి తప్పించగలిగారు. అదే సమయంలో కర్నూలు జిల్లాలో ఉన్న నందికొట్కూరు, కోడుమూరు, కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గాల్లో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడ్డారు. ఐదేళ్లు అధిష్టానంతో మొరపెట్టుకున్నా ఫలితం లభించలేదు.

ఏ నియోజకవర్గంలో…..

ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ తాము దళిత పక్షపాతని చెప్పుకుంటోంది. కానీ ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే ఆర్థర్, సిద్ధార్ధరెడ్డికి మధ్య గత పదిహేడు నెలలుగా ివిభేధాలున్నాయి. వీరిద్దరి మధ్య పంచాయతీని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీర్చేందుకు ప్రయత్నించినా ఆర్ధర్ నే సర్దుకుపొమ్మన్నారని అన్నారని అంటున్నారు. ఇది నెల్లూరు పెద్దారెడ్డి పంచాయతీ అని ఆర్థర్ వర్గం నిరసన వ్యక్తం చేస్తుంది.

వారి పెత్తనమే…

ఇక ఇదే జిల్లాలోని కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డిలకు మధ్య విభేదాలు తీవ్ర మయ్యాయి. ఏదైనా కాంట్రాక్టు పనులు ఎమ్మెల్యేకు తెలియకుండా హర్షవర్ధన్ రెడ్డి తన అనుచరులకు కట్టబెడుతున్నారట. దీంతో ఎమ్మెల్యేకు చిర్రెత్తుకొచ్చి అధికారులపై ఫైర్ అవుతున్నారట. అధికారులు కూడా విష్ణువర్ధన్ రెడ్డి వైపే ఉండటంతో ఎమ్మెల్యే ఏమీ చేయలేకపోతున్నారు. ఇక పాయకరావుపేటలో సీనియర్ నేత, ఎమ్మెల్యే గొర్ల బాబూరావు పరిస్థితి కూడా ఇంతే. ముందు వైసీపీలోని దళిత ఎమ్మెల్యేల సమస్యలను జగన్ వినాలని, తర్వాత బయట సమస్యలను పరిష్కరించవచ్చని ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీ చూసుకోవాల్సి ఉంటుందని సంకేతాలు కూడా కొందరు పంపుతున్నారు.

Tags:    

Similar News