సిద్ధూ సై అనడానికి కారణమిదే

సిద్ధరామయ్య లో కొత్త ఆశలు చిగురించాయి. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే తిరిగి కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అందుకే [more]

Update: 2019-10-30 17:30 GMT

సిద్ధరామయ్య లో కొత్త ఆశలు చిగురించాయి. ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే తిరిగి కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అందుకే ఉప ఎన్నికలపై సిద్ధరామయ్య ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ కూడా సిద్ధరామయ్యకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీని కోలుకునేలా చేశాయి.

అక్కడ ఆదరించకపోవడంతో….

అక్కడ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలను ప్రజలు ఆదరించలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హేమాహేమీలు సయితం పార్టీలు మారి ఓటమి పాలయ్యారు. దీంతో సిద్ధరామయ్య విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ వెనకబడి ఉండటం, మోడీ క్రేజ్ తగ్గిందన్న సంకేతాలు వెలువడటంతో సిద్ధరామయ్య మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. అభ్యర్థుల ఎంపికను అందరి ఆమోదంతో చేయాలని నిర్ణయించారు.

బలమైన నేతలను…..

కర్ణాటకలో అసెంబ్లీ ఉప ఎన్నికలు డిసెంబరు 5వ తేదీన జరగనున్నాయి. బీజేపీ ఇప్పటికే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు టిక్కెట్లు గ్యారంటీ అని తేల్చింది. దీంతో ఖచ్చితంగా పదిహేను సీట్లకు పదిహేను సాధించాలన్న లక్ష్యంతో సిద్ధరామయ్య ఉన్నారు. హై కమాండ్ కూడా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సిద్ధరామయ్యకే అప్పగించడంతో ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థులను నిలబెడితే సానుభూతితో గెలుపొందవచ్చన్నది సిద్ధరామయ్య వ్యూహంగా కన్పిస్తుంది.

ఖచ్చితంగా గెలుస్తామని…..

జనతాదళ్ ఎస్ ఒంటరిగా పోటీ చేసినప్పటికీ తమకు ప్రత్యేకంగా జరిగే నష్టమేదీ లేదని అంచనా వేస్తున్నారు. తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ ఎవరి సిట్టింగ్ స్థానాలు వారు గెలుచుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థిితి కర్ణాటకలో కూడా వస్తే మొత్తానికి మొత్తం సీట్లు కాంగ్రెస్, జేడీఎస్ ఖాతాలో పడతాయన్నది సిద్ధరామయ్య ఆలోచనగా ఉంది. అందుకే సిద్ధరామయ్య యడ్యూరప్ప ప్రభుత్వం ఇంకా నెలరోజులనే కామెంట్స్ ను తరచూ చేస్తున్నారు. ప్రచారంలోనూ ఇదే ప్రధాన అంశంగా లేవనెత్తనున్నారు. మొత్తం మీద తాజాగా జరిగిన ఎన్నికలు సిద్ధరామయ్యలో ఆశలు మరింత పెంచాయి.

Tags:    

Similar News