అందరికీ టెన్షనే….కారణాలివే?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడం రాజకీయ పార్టీల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రచారానికి వచ్చిన జనం ఓట్లు వేయడానికి రాకపోవడంపై రాజకీయ పార్టీలు [more]

Update: 2020-12-04 00:30 GMT

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడం రాజకీయ పార్టీల్లో ఆందోళన కలిగిస్తుంది. ప్రచారానికి వచ్చిన జనం ఓట్లు వేయడానికి రాకపోవడంపై రాజకీయ పార్టీలు సమీక్షలకు దిగాయి. ఓటింగ్ శాతం తగ్గడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అన్న లెక్కలు వేసుకుంటున్నారు. డివిజన్ల వారీగా అభ్యర్థులు తమ గెలుపు అవకాశాలను పార్టీ అధినాయకత్వానికి నివేదిక రూపంలో అందిస్తున్నారు.

భయపడుతూనే….

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై టీఆర్ఎస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కరోనా, ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఓటర్లు తమపై ఆగ్రహంతో ఉంటారేమోనని టీఆర్ఎస్ భయపడుతూనే ఉంది. అయితే పోలింగ్ శాతం తగ్గడంతో కొంత ఊపిరిపీల్చుకుంది. పోలింగ్ శాతం తగ్గడం అధికార పార్టీకి లాభమేనని అంచనా వేస్తున్నారు. ఎక్కువ శాతం పోలింగ్ జరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని ఎన్నికల నిపుణులు కూడా చెబుతున్నారు.

పోలింగ్ శాతం తగ్గడంపై….

ిమున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి కేటీఆర్ వివిధ డివిజన్ల నుంచి నివేదికలను తెప్పించుకుంటున్నారు. అరవైకి పైగా స్థానాలను ఖచ్చితంగా సాధిస్తామన్న నమ్మకాన్ని కేటీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రేటర్ పీఠం పై తిరిగి గులాబీ జెండానే ఎగురనుందని ఆయన నమ్మకంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలతో కేటీఆర్ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కౌంటింగ్ వద్ద కూడా అప్రమత్తంగా ఉండేలా ఏజెంట్లను పంపాలని ఆయన సూచించారు.

కావాలనే చేశారంటూ…..

మరోవైపు బీజేపీ ప్రభుత్వంపై నిందలు వేస్తుంది. పోలింగ్ శాతం తగ్గాలనే కేసీఆర్ వరస సెలవులు చూసి ఎన్నికలను పెట్టారని బీజేపీ ఆరోపిస్తుంది. అందుకే హైదరాబాదీలు గ్రామాలకు వెళ్లారని, ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని బీజేపీ చెబుతోంది. కావాలనే పోలింగ్ శాతం తగ్గేలా చేశారంటోంది. ఇక తమకు పట్టున్న పాతబస్తీలో సయితం ఓటింగ్ శాతం తగ్గడంపై మజ్లిస్ ఆందోళనగా ఉంది. అయితే ఓటింగ్ శాతం తగ్గినా నలభై డివిజన్లకు తగ్గకుండా విజయం సాధిస్తామని అసదుద్దీన్ ఒవైసీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మరికొద్ది గంటల్లోనే గ్రేటర్ నేతల భవితవ్యం తేలిపోనుంది.

Tags:    

Similar News