జ‌గ‌న్ వారికి కుర్చీలిచ్చినా… ఈ పంచాయితీ తేలట్లేదే ?

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన స‌ర్పంచుల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. నూతన సర్పంచ్‌లు కేవలం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి కూర్చొని వచ్చేందుకు మాత్రమే పరిమితమయ్యారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు [more]

Update: 2021-05-04 12:30 GMT

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన స‌ర్పంచుల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. నూతన సర్పంచ్‌లు కేవలం పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి కూర్చొని వచ్చేందుకు మాత్రమే పరిమితమయ్యారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అనంతరం కౌంటింగ్‌ జరగ్గా ఆ రోజునే రిటర్నింగ్‌ అధికారుల వద్ద గెలుపొందినట్లుగా ధ్రువీకరణ పత్రాలను అందుకున్న నూతన సర్పంచ్‌లు బాధ్యతల కోసం నెలన్నర ఎదురుచూశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఎట్టకేలకు ఈ నెల 3న పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి సర్పంచ్‌లకు బాధ్యతలు అప్పగించారు.

చెక్ పవర్ లేకపోవడంతో…

పంచాయతీ సర్పంచ్‌లకు గ్రామంలో ఏ పనిచేయాలన్న సర్వాధికారాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో.. భిన్నమైన పరిస్థితి ఉంది. అట్టహాసంగా ఈ నెల 3న బాధ్యతలు స్వీకరించారే తప్ప ప్రభుత్వం నుంచి ఇంత వరకూ చెక్‌పవర్ రాలేదు. ఈ చెక్‌పవర్‌ లేకపోవడంతో నూతన సర్పంచ్‌లు ఆయా గ్రామ పంచాయతీల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో తాగునీటి సమస్యతో పాటు, ఇతర ముఖ్యమైన పనులు చేపట్టేందుకు కూడా సర్పంచ్‌లకు అవకాశం లేకపోవడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు.

అజమాయిషీ లేకుండా…?

ఇదిలా ఉంటే గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు, వ‌లంటీర్లపై కూడా స‌ర్పంచ్‌ల‌కు అజ‌మాయిషీ లేకుండా చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యంతో స‌ర్పంచ్‌ల అధికారాల‌కు మ‌రింత క‌త్తెర ప‌డిన‌ట్లయ్యింది. దీంతో వీళ్లంగా కూడా గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే గెలిచినోళ్లంతా సర్పంచ్‌లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజువారీ పంచాయతీ కార్యాలయాలకు వచ్చి సీట్లో కూర్చొని తిరిగి వెళ్లిపోవడమే జరుగుతోంద‌ని రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్పంచులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

ఏ పనులు చేపట్టాలన్నా….?

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా కొత్తగా ఏ పనులు చేపట్టాలన్నా చెక్‌పవర్‌ అవసరం ఉంద‌ని, అయితే ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇంతవరకూ ఇవ్వకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నామ‌ని సర్పంచ్ లు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌ర్పంచ్‌లో ( 90 శాతం స‌ర్పంచ్‌లు వైసీపీ వాళ్లే) ప్రభుత్వంపై, ఇటు ముఖ్యమంత్రిపై తీవ్రమైన అసంతృప్తి ఏర్పడుతోంది.

Tags:    

Similar News