ఆ మ‌హిళా నేత‌ల‌కు ఫ్యూచ‌ర్ లేన‌ట్టేనా..?

సాధార‌ణ లైఫైనా.. పొలిటిక‌ల్ కెరీర్ అయినా.. ఆచి తూచి అడుగులు వేయ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్వ‌ని అంటారు ప‌రిశీల‌కులు. చిన్న చిన్న ఆశ‌ల‌కు లొంగిపోతే.. చిన్నపాటి ప్రలోభాల‌కు క‌ట్టుదాటితే.. [more]

Update: 2020-10-17 13:30 GMT

సాధార‌ణ లైఫైనా.. పొలిటిక‌ల్ కెరీర్ అయినా.. ఆచి తూచి అడుగులు వేయ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్వ‌ని అంటారు ప‌రిశీల‌కులు. చిన్న చిన్న ఆశ‌ల‌కు లొంగిపోతే.. చిన్నపాటి ప్రలోభాల‌కు క‌ట్టుదాటితే.. నాయ‌కులు ఎంత‌టి ప్రజాద‌ర‌ణ ఉన్నవారైనా.. ఎలాంటి వ్యూహాలు చేయ‌గ‌ల వారైనా.. కూడా చేతులు కాల్చుకోవ‌డం ఖాయం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నాయ‌కురాళ్లకు ఎదురైంది. 2014లో వైసీపీ త‌ర‌ఫున చాలా మంది మహిళా నేతలు విజ‌యం సాధించారు. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాలు, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాలు మ‌హిళ‌ల‌కు బ్రహ్మర‌థం ప‌ట్టాయి. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, రంప‌చోడ‌వ‌రం నుంచి వంత‌ల రాజేవ్వరి, పామ‌ర్రు నుంచి ఉప్పులేటి క‌ల్పన‌ వంటివారు వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు.

బాబు ఆకర్ష్ తో…..

అదే స‌మ‌యంలో క‌ర్నూలు ఎంపీగా బీసీ వ‌ర్గానికి చెందిన బుట్టా రేణుక విజ‌యం సాధించారు. ఇదే జిల్లా పాణ్యంలో గౌరు చ‌రితా రెడ్డి కూడా గెలుపు గుర్రం ఎక్కారు. నిజానికి ఈ రేంజ్‌లో వైసీపీ త‌ర‌ఫున మ‌హిళ‌లు గెలుపుగుర్రాలు ఎక్కారు త‌ప్పితే.. టీడీపీలో ఈ త‌ర‌హా దూకుడు క‌నిపించ‌లేదు. అయితే, వీరంతా వైసీపీని న‌మ్ముకుని తొలి రెండేళ్లు ఉన్నారు. ఆ త‌ర్వాత చంద్రబాబు 2016 మ‌ధ్యలో ఆక‌ర్ష్ ప్ర‌యోగం చేయ‌డంతో వీరంతా ఆయ‌న వ‌ల‌కు చిక్కుకున్నారు. రాజ‌కీయంగా దూకుళ్లు సాధార‌ణమే అయిన‌ప్పటికీ.. ముందూ వెనుకా ఆలోచించుకోకుండా.. వారు జంప్ చేసేశారు. అప్పటి వ‌ర‌కు జ‌గ‌న్‌ను దేవుడిక‌న్నా ఎక్కువ అన్న గిడ్డి ఈశ్వరి వంటివారు కూడా సైకిల్ ఎక్కారు.

ప్రభావం చూపించలేక….

స‌రే! వీరు టీడీపీలోకి వెళ్లి సాధించేందేంటి? అంటే కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి నిధులు మాత్రమే ( ఈ నిధులు కూడా పూర్తిగా ఇవ్వని దుస్థితి) త‌ప్ప.. ఇంకేమీ సాధించ‌లేక పోయారు. మంత్రి ప‌ద‌వులు, కార్పొరేష‌న్ ప‌దవులు కూడా వీరికి ద‌క్కలేదు. ఈ నేప‌థ్యంలో వీరు ఒంట‌రులుగా మారిపోయారు. అటు ప్రజ‌ల్లోనూ విశ్వస‌నీయ‌త‌ను పోగొట్టుకున్నారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ వీరిలో బుట్టా రేణుక‌కు మిన‌హా(ఈమె ఎన్నిక‌ల‌కు ముందు చెంప‌లేసుకుని వైసీపీ గూటికి చేరుకున్నారు.) మిగిలిన వారికి టికెట్లు ఇచ్చినా.. ప్రయోజ‌నం క‌నిపించ‌లేదు. పోనీ.. ఇప్పుడు పార్టీలో అయినాప్ర‌భావం చూపుతున్నారా ? అంటే అది కూడా లేదు.

టీడీపీలోకి వచ్చి…..

అస‌లు పార్టీయే వీరిని ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. దీంతో రెంటికీ చెడ్డ రేవ‌డిగా మిగిలిపోయార‌నే ఆవేద‌న మాత్రం వీరికి మిగిలింది. అటు ప్రజ‌ల‌కు, ఇటు పార్టీల‌కు కూడా దూర‌మై.. భ‌విష్యత్తునే ప్రశ్నార్థకం చేసుకున్నారు. అదే వీరు వైసీపీలో ఉండి ఉంటే.. ఇప్పుడు క‌నీసం వీరికి మంత్రి ప‌ద‌వుల‌తో స‌మాన‌మైన గౌర‌వం ల‌భించేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డం గ‌గ‌న‌మైన ఈ రోజుల్లో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోక‌పోవ‌డం, స‌మ‌యోచితంగా నిర్ణయాలు తీసుకోక‌పోవ‌డంతో వీరికి ఫ్యూచ‌ర్‌పై బెంగ‌ప‌ట్టుకుంద‌నేది వాస్తవం. మ‌రి ఈ మ‌హిళా నేత‌ల భ‌విష్యత్తు ఎలా ? ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News