వైసీపీ కెలుకుడు… టీడీపీలో సణుగుడు ?

టీడీపీలో కొందరు పాత తరం నేతలకు అకస్మాత్తుగా పొలిటికల్ గా ఎలివేషన్ వచ్చేస్తోంది. వారిని కావాలని టీడీపీ పక్కన పెట్టేస్తోంది. మరి అది వ్యూహమో లేక దూకుడో [more]

Update: 2021-02-11 13:30 GMT

టీడీపీలో కొందరు పాత తరం నేతలకు అకస్మాత్తుగా పొలిటికల్ గా ఎలివేషన్ వచ్చేస్తోంది. వారిని కావాలని టీడీపీ పక్కన పెట్టేస్తోంది. మరి అది వ్యూహమో లేక దూకుడో తెలియదు కానీ వైసీపీ అలాంటి వారినే టార్గెట్ చేస్తోంది. దాంతో వారు ఒక్కసారిగా హీరోలు అవుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వారి గురించి మాట్లాడుతూ తమ వారుగా గట్టిగా క్లైం చేసుకోవడానికి టీడీపీ తమ్ముళ్ళు పడుతున్న తంటాలు సైకిల్ పార్టీలో కొత్త సెగలు పుట్టిస్తున్నాయి. వర్గ పోరు మరో మారు ఆ విధంగా పెచ్చరిల్లుతోంది కూడా.

అశోక్ కి అండగా…

నిజానికి విజయనగరం పూసపాటి వంశాధీశుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుని టీడీపీ చాన్నాళ్ళుగా సైడ్ చేసేసింది. తాజాగా జరిగిన పార్టీ పదవుల భర్తీలో అశోక్ కి కానీ ఆయన కుమార్తె అతిధి గజపతిరాజుకు కానీ చోటు కల్పించలేదు. ఆయన చెప్పిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. మరో వైపు అశోక్ బంగ్లాకు పోటీగా విజయనగరంలో ఇంకో టీడీపీ ఆఫీస్ వెలసింది. ఇలా అశోక్ ని పట్టించుకోకుండా జిల్లాలో టీడీపీ రాజకీయం సాగిపోతున్న వేళ వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక్కసారిగా కెలికారు. అశోక్ మీద నోరు చేసుకున్నారు. ఫలితంగా టీడీపీలో అంతా కలసి అశోక్ కి అండగా నిలబడాల్సివచ్చింది. పార్టీలో అందరూ జై అశోక్ అనాల్సి వచ్చింది. దీంతో ఒక్క లెక్కన వర్గ పోరు కూడా విజయనగరం జిల్లాలో మళ్ళీ లేచింది.

కళాతో అలా….

ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి కళా వెంకటరావుని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించారు. ఆ మీదట ఆయన ఊసు లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో కావాలని చేశారో లేక ఏమో కానీ కళా పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. దాంతో కొంత ఎడం కూడా పార్టీతో వచ్చింది. సరిగ్గా ఈ సమయంలో వైసీపీ సర్కార్ ఆయన్ని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కళా లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ఆయనకు మద్దతుగా టీడీపీ పెద్దలు అంతా గట్టిగా నోరు విప్పాల్సివచ్చింది. కళాకు సొంత పార్టీలో ప్రత్యర్ధిగా ఉన్న అచ్చెన్నాయుడు కూడా గర్జించాల్సివచ్చింది. మొత్తానికి టీడీపీలో కళా ప్లేస్ సెట్ చేసి పెట్టింది ఈ అరెస్ట్ పర్వం. అదే టైమ్ లో మళ్ళీ పార్టీ లో కొత్త పోరుకు కూడా నాంది పలికినట్లు అయిందని అంటున్నారు.

వాపా బలమా…?

టీడీపీలో కొత్త నీరు అంటూ తెలుగుదేశం ప్రయోగాలు చేస్తోంది. దాంతో సహజంగా పాత నీరు వెనక్కిపోతోంది. వైసీపీ చూసి మరీ పాత కాపులను టార్గెట్ చేతోంది. దాంతో వారు ఒక్కసారిగా ముందుకు వస్తున్నారు. అది కొత్త నేతలకు ఇబ్బందిగా ఉంటోంది. ఇక పార్టీలో వారి హవా సరి అనుకున్న వేళ పాతకాపులు హైలెట్ కావడం టీడీపీకి వాపా బలమా అన్నది కూడా తెలియడంలేదుట. మరో వైపు కొత్త కమిటీలలో ఉన్న వారికి పాత కాపులతో అసలు పడడంలేదు. కానీ వైసీపీకి యాంటీగా వారు నోరు విప్పాల్సివస్తోంది. ఈ పరిణామాలు కక్కలేక మింగలేక అన్నట్లుగా తమ్ముళ్లకు ఉన్నాయట. మొత్తానికి ఇది కూడా వైసీపీ మైండ్ గేమా అన్న అనుమానాలు తమ్ముళ్ళు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News