చేతులెత్తేసిన సోమిరెడ్డి.. మార్పు ఖాయమేనా..?
ఆయన సీనియర్ నాయకుడు. మంచి వాయిస్ ఉంది. ఆచితూచి విమర్శలు చేయగల నేర్పు కూడా ఉంది. వివాదాలకు, విధ్వంసాలకు కడుదూరంగా ఉండే మనస్తత్వం కూడా ఉంది. అవినీతి [more]
ఆయన సీనియర్ నాయకుడు. మంచి వాయిస్ ఉంది. ఆచితూచి విమర్శలు చేయగల నేర్పు కూడా ఉంది. వివాదాలకు, విధ్వంసాలకు కడుదూరంగా ఉండే మనస్తత్వం కూడా ఉంది. అవినీతి [more]
ఆయన సీనియర్ నాయకుడు. మంచి వాయిస్ ఉంది. ఆచితూచి విమర్శలు చేయగల నేర్పు కూడా ఉంది. వివాదాలకు, విధ్వంసాలకు కడుదూరంగా ఉండే మనస్తత్వం కూడా ఉంది. అవినీతి అనేది కూడా ఆయన డిక్షనరీలో లేదని చెబుతారు అనుచరులు. అయితే, ఆయనకు లేనిదల్లా ప్రజలను మెప్పించే లక్షణమే. ప్రజల ఓట్లను కొల్లగొట్టే తత్వమే. దీంతో ఆయన వరుస పరాజయాల పరాక్రమ రాజకీయ వీరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే నెల్లూరు జల్లా సర్వేపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఆయన చక్రం తిప్పుతున్నారు.
వరస ఓటములతో…..
ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో అతి కష్టం మీద రెండుసార్లు విజయం సాధించారు. 1994, 1999లో టీడీపీ వేవ్‌లో రెండుసార్లు ఆయన గెలిచారు. ఆ తర్వాత నుంచి ఐదుసార్లు ఓటమినే కౌగిలించుకుంటున్నారు. అయినా కూడా నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తున్న క్రమంలో చంద్రబాబు ఆయనకు పదవులు ఇస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2004, 2009 ఎన్నికల్లో ఓడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన 2014లో ఓటమి పాలయ్యారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఉన్న నమ్మకం, గౌరవంతో ఆయనను ఎమ్మెల్సీని చేసి మరీ.. మంత్రి పదవిని ఇచ్చారు. ఇక పార్టీలోనూ కీలక పదవులు అప్పగించారు.
ఎమ్మెల్సీ పదవిని వదులుకుని…
అయితే, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అతి విశ్వాసానికి పోయారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తన గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అప్పటి వరకు ఉన్న మండలి పదవిని కూడా వదులుకుని వచ్చి (వాస్తవానికి అప్పటి వరకు ఎమ్మెల్సీలుగా ఉన్నవారు ఎవరూ కూడా రాజీనామా చేయకుండానే ఎన్నికల్లో పోటీ చేశారు.) ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లోనూ వైసీపీ ప్రభంజనంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విలవిల్లాడారు. ఈ క్రమంలో ఇప్పుడు కింకర్తవ్యం అని తలపట్టుకున్నారు. నిజానికి సోమిరెడ్డి రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు రాజగోపాల్ రెడ్డి యాక్టివ్‌లోనే ఉన్నారు. గత ఎన్నికల్లోనే ఆయన పోటీ చేయాలని అనుకున్నారు.
కుమారుడికే అప్పగించాలని….
ఈ క్రమంలోనే నియోజకవర్గంలోనూ పాదయాత్ర చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టికెట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే చంద్రబాబు ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలి. ఇక , తాను తప్పుకొని కుమారుడికి పగ్గాలు అప్పగించడమే చంద్రమోహన్‌రెడ్డి ముందున్న కర్తవ్యంగా చెబుతున్నారు పరిశీలకులు. మరి ఆయన ఏం చేయనున్నారో చూడాలి.