బీజేపీ ఘ‌ర్ వాప‌సీ.. షార్ప్ షూట‌ర్‌కే బాధ్యత‌లు

జాతీయ అతిపెద్ద పార్టీ బీజేపీ ఏపీలో ఎదిగేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌పై ఉన్న బీజేపీ జాతీయ [more]

Update: 2020-10-02 08:00 GMT

జాతీయ అతిపెద్ద పార్టీ బీజేపీ ఏపీలో ఎదిగేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌పై ఉన్న బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం.. ఆదిశ‌గా కావాల్సిన కార్యాచ‌ర‌ణ‌ను త‌న‌దైన శైలిలో అమ‌లు చేస్తోంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న నాయ‌కుల‌ను బీజేపీ సార‌థులుగా నియమించింది. దీంతో పాటు స‌ద‌రు నాయ‌కులకు వాగ్ధాటి కూడా ఉండ‌డం పార్టీకి క‌లిసి వ‌చ్చే ప‌రిణామం. ఏపీ విష‌యానికి వ‌స్తే.. సోము వీర్రాజు పార్టీని లీడ్ చేస్తున్నారు. ఆయ‌నకు షార్ప్ షూట‌ర్ అనే పేరుంది. ఆయ‌న పార్టీలో త‌లెత్తే ఏ స‌మ‌స్యనైనా చిటిక‌లో ప‌రిష్కరిస్తార‌నే పేరు తెచ్చుకున్నారు.

ఎవరిపైనైనా విమర్శలు చేసేందుకు……

ఎవ‌రిపై అయినా విమ‌ర్శలు చేయ‌డంలో వీర్రాజుకు ఏ మాత్రం మొహ‌మాటం ఉండ‌దు. గ‌తంలో ఏపీ బీజేపీ సార‌థులుగా ఉన్న హ‌రిబాబు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి నేత‌లు చంద్రబాబు లాంటి వాళ్లను విమ‌ర్శించే విష‌యంలో మొత్తగా ఉండ‌డంతో పార్టీకి స‌రైన మార్గద‌ర్శక‌త్వం అంటూ లేకుండా పోయింది. గ‌తంలో చంద్రబాబు హ‌యాంలో కాపుల ఉద్యమం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు బీజేపీ నేత‌లు సంయ‌మ‌నం పాటించ‌డం వెనుక సోము వీర్రాజు చ‌క్రం తిప్పార‌ని అంటారు. ఇప్పుడు కూడా ఆయ‌న షార్ప్ షూట‌ర్ ప‌నిత‌నాన్ని పార్టీ పూర్తిగా వినియోగించు కునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని స‌మాచారం.

అన్ని కోణాల్లోనూ….

అంటే.. పార్టీని అన్ని కోణాల్లోనూ డెవ‌ల‌ప్ చేసుకునేందుకు ఉన్న మార్గాల్లో కొత్త నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం అనేది స‌హ‌జ ప్రక్రియే. అయినా పార్టీని వీడిపోయిన పాత వారిని తిరికి పార్టీలోకి చేర్చుకునేందుకు అనుస‌రించాల్సిన వ్యూహం కూడా అంతే ముఖ్యం. ఈ విష‌యంలో సోము కీల‌కంగా మార‌తార‌నే ప్రచారం జ‌ర‌గుతోంది. గ‌తంలో బీజేపీ త‌ర‌ఫున గెలిచిన నాయ‌కుల్లో కొంద‌రుపార్టీకి దూర‌మ‌య్యారు. అదేవిధంగా కొత్తగా చేరిన వారు కూడా పార్టీలో యాక్టివ్‌గా లేరు ఇలాంటివారిని గుర్తించి, వారిని తిరిగి పార్టీలో యాక్టివ్ చేయ‌డం, పార్టీలో బాధ్యత‌లు అప్పగించ‌డం వంటి కీల‌క బాధ్యత‌ను సోము వీర్రాజు పై పెట్టార‌ట‌.. జాతీయ‌బీజేపీ నాయ‌కులు.

తిరిగి తీసుకునేందుకు…..

గ‌తంలో రాజ‌మండ్రి సిటీ నుంచి గెలిచిన ఆకుల స‌త్యనారాయ‌ణ వంటి వారు గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారిపోయారు. ఇక‌, కొంద‌రు పార్టీలో ఇన్ య‌క్టివ్‌గా ఉన్నారు. ఇలాంటి వారిని తిరిగి పార్టీలో చేర్చేందుకు సోము మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే, ఈ క్రమంలో స‌ద‌రు నేత‌ల‌కు గ‌ట్టి హామీలు ఇచ్చేందుకు కూడా సోము సిద్ధంగానే ఉన్నార‌ని స‌మాచారం. ఇక‌, టాలీవుడ్‌లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రించేవారిపైనా సోము దృష్టి పెట్టనున్నార‌ని. అవ‌స‌ర‌మైతే.. జ‌న‌సేనాని ప‌వ‌న్ సాయం కూడా తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News