ఊపు తెచ్చారు స‌రే… నిల‌బ‌డుతుందా…?

రాష్ట్రంలో బీజేపీని ప‌రుగులు పెట్టిస్తాన‌ని చెప్పిన బీజేపీ ఏపీ సార‌థి.. సోము వీర్రాజు ఈ విష‌యంలో ఒకింత దూకుడు ప్రద‌ర్శించారు. రాష్ట్రంలో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను అజెండాగా [more]

Update: 2020-10-21 15:30 GMT

రాష్ట్రంలో బీజేపీని ప‌రుగులు పెట్టిస్తాన‌ని చెప్పిన బీజేపీ ఏపీ సార‌థి.. సోము వీర్రాజు ఈ విష‌యంలో ఒకింత దూకుడు ప్రద‌ర్శించారు. రాష్ట్రంలో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను అజెండాగా తీసుకుని.. ఆయ‌న ఇచ్చిన పిలుపు స‌క్సెస్ అయింది. పార్టీలో నేత‌లు.. మూకుమ్మడిగా.. రాష్ట్రంలో జ‌రిగిన ఒక రోజు ఉద్యమానికి క‌దిలి వ‌చ్చారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ బీజేపీ దూకుడు ప్రద‌ర్శించింది. నాయ‌కులు రోడ్లెక్కారు. ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డారు. దేవాల‌యాల‌పై దాడుల‌ను ఖండించారు. చాలా చోట్ల నిర‌స‌న ప్రద‌ర్శన‌లు పీక్ స్టేజ్‌కు వెళ్లాయి.

కొత్త.. పాత నేతలు కలిసి……

ఇది ఒక‌ర‌కంగా.. సోము వీర్రాజుకు నైతిక విజయం. ఇప్పటి వ‌ర‌కు రాష్ట్రంలో బీజేపీ చేప‌ట్టిన అనేక ఉద్యమాలు ఉన్నప్పటికీ.. ఈ రేంజ్‌లో పార్టీ నేత‌లు మూకుమ్మడిగా క‌లిసి వ‌చ్చిన ఉద్యమం అంటూ.. ఉంటే అది ఇదే అంటున్నారు ప‌రిశీల‌కులు కూడా. అయితే, ఈ దూకుడు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు నిలుస్తుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగా ఉంది. దీనికి ప్రధానంగా ప్రస్తుతం జ‌రిగిన ఆందోళ‌నే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఒక‌వైపు ఇది స‌క్సెస్ అయిందని, కొత్త, పాత నేత‌లు అంద‌రూ కూడా ఒకే తాటిపైకి వ‌చ్చి.. నిర‌స‌న వ్యక్తం చేశార‌ని అంటున్నా.. దీనివెనుక.. వేరే అజెండా ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

అందుకే వచ్చారట…..

పార్టీలో ఉన్న వారిలో చాలా మందికి సోము వీర్రాజు అంటే పెద్దగా ప‌డడం లేదు. అయినా.. తాజాగా ఉద్యమానికి క‌లిసివ‌చ్చి.. ఈ రేంజ్‌లో ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం, రోడ్లెక్కడం వెనుక‌.. వేరే ఆలోచ‌న ఉంద‌నే ప్రచారం జ‌రుగుతోంది. మంత్రి నాని.. నేరుగా కేంద్రంలోని ప్రధాని న‌రేంద్ర మోడీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేసిన నేప‌థ్యంలోనే సీనియ‌ర్లు రోడ్లెక్కార‌ని, రాష్ట్ర బీజేపీ విష‌యంలో కాద‌నేది ప‌రిశీల‌కుల మాట‌.

బలపడిందనుకుంటే…?

రాష్ట్రంలో ఇటీవ‌ల కాలంలో బీజేపీ అనేక కార్యక్రమాలు నిర్వహించినా.. ఇప్పుడు మాత్రమే వీరు రోడ్డెక్కడం వెనుక రీజ‌న్ ఇదేన‌ని చెబుతున్నారు. దీనిని చూసుకుని బీజేపీ బ‌ల‌ప‌డింద‌నుకోవ‌డం పొర‌పాటు అవుతుంద‌ని, సంస్థాగ‌తంగా పార్టీని న‌డిపించేందుకు ఇది సాయం చేయ‌బోద‌ని.. మున్ముందు చాలా చేయాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి వీరి సూచ‌న‌ల‌ను సోము వీర్రాజు ఎలా తీసుకుంటారో ? చూడాలి.

Tags:    

Similar News