మైక్ లేకుంటే.. ఆయాసం.. ఉంటే ఆవేశం

రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైఖ‌రిపై.. సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర కామెంట్లు ప‌డుతున్నాయి. ఆయ‌న మైకు ముందుకు వ‌స్తే.. పూన‌కం వ‌చ్చిన వ్యక్తిగా ఊగిపోతార‌ని.. మైకు [more]

Update: 2020-11-24 00:30 GMT

రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైఖ‌రిపై.. సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర కామెంట్లు ప‌డుతున్నాయి. ఆయ‌న మైకు ముందుకు వ‌స్తే.. పూన‌కం వ‌చ్చిన వ్యక్తిగా ఊగిపోతార‌ని.. మైకు ముందుకు రాకుంటే.. వాన‌పాములా మారిపోతారంటూ.. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో నిర్వహించిన మీడియా మీటింగ్ అనంతరం.. సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చుట్టేశాయి. వాస్తవానికి బీజేపీ ప‌రిస్థితి ఏపీలో ఏమీ బాగోలేద‌ని ఆ పార్టీ నేత‌లే ఒప్పుకొంటున్నారు. ఆ పార్టీ నేత‌లు ఒప్పుకోవ‌డ‌మే కాదు. ఏపీకి రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన టైంలో ఇచ్చిన హామీలే కాదు పోల‌వ‌రం విష‌యంలో కూడా బీజేపీ తీర‌ని అన్యాయం చేస్తుంద‌న్న భావ‌న ఏపీ ప్రజ‌ల‌కు వ‌చ్చేసింది. దీంతో బీజేపీ అంటేనే ఏపీ ప్రజ‌లు అస‌హ్యించుకుంటున్నారు. అలాంటి బీజేపీలో పార్టీ కోసం కాకుండా స్వలాభం కోసం ఉన్న నేత‌లు త‌ప్ప ఎవ్వరూ కొత్తగా చేరే ప‌రిస్థితి లేదు.

సీరియల్ నటుడంటూ….

పార్టీలో చేరే వారు కూడా పార్టీ కోసం క‌ష్టప‌డే ప‌రిస్థితి లేదు. ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న పార్టీని ఉన్నత పార్టీగా తీర్చిదిద్దాలంటే ఎంతో క‌ష్టప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కూడా చెబుతున్నారు. మ‌రి దీనికి త‌గిన విధంగా ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల్సిన సోము వీర్రాజు.. మైకు క‌నిపిస్తే.. రెచ్చిపోతున్నారు. ఆయ‌న అస‌లు ఏం మాట్లాడుతున్నారో.. ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారో.. కూడా అర్ధం కావ‌డంలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలోనూ ట్రోల్స్ న‌డుస్తున్నాయి. “సారూ.. మీరు ఏ పార్టీ“ అని ఒక‌రు వ్యంగ్యాస్త్రం సంధిస్తే.. మ‌రొక‌రు.. అన్ని పార్టీల హావ‌భావాలూ ప‌లికిస్తున్న సోము.. వీర్రాజు సీరియ‌ల్ న‌టుడిగా ప‌నికొస్తారంటూ.. కామెంట్లు కురిపిస్తున్నారు.

ప్రతిపక్షంపైనే….

బీజేపీ వంటి కీల‌క పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు తాజాగా మాట్లాడిన తీరు అంద‌రినీ విస్మయానికి గురి చేస్తోంది. ఎవ‌రైనా అధికారంలో ఉన్న పార్టీ త‌ప్పుల‌ను ఎత్తి చూపేందుకు ప్రయ‌త్నిస్తారు. కానీ, సోము వీర్రాజు మాత్రం ప్రతిప‌క్ష టీడీపీ గ‌తంలో చేసిన త‌ప్పుల‌నే ప‌ట్టుకుని ఇంకా వేలాడుతున్నారు పోనీ ఇక్కడితో అయినా.. ఆగారా? అంటే లేదు. కొంత సేపు చంద్రబాబు అంటారు. మ‌రికొంత సేపు వైసీపీపైనా విరుచుకుప‌డుతున్నారు. ఇక‌, అత్యంత కీల‌క ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింల‌ను టార్గెట్ చేశారు. స‌రే ఎలాగూ.. ముస్లిం ఓటు బ్యాంకుతో బీజేపీకి ప‌నిలేద‌ని అనుకుంటున్నారు క‌నుక ఈ విష‌యాన్ని అర్ధం చేసుకోవ‌చ్చు.

అందుకే సెటైర్లు…..

కానీ.. చ‌నిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఓ కుటుంబంపై క‌నీసం జాలి కూడా చూప‌కుండా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల‌పై కులాల‌కు, మ‌తాల‌కు అతీతంగా స్పందిస్తున్న తీరు గ‌మ‌నార్హం. ఎందుకంటే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు అంద‌రూ ఏకం కావ‌డం స‌హ‌జం. ముక్తకంఠంతో అంద‌రూ ఖండించ‌డ‌మూ మ‌నం చూస్తున్నాం. కానీ.. సోము వీర్రాజు మాత్రం వీటికి కూడా భిన్నంగా వ్యవ‌హరించి.. మైకుముందు రెచ్చిపోయారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న సోష‌ల్ మీడియా జ‌నాలు.. సోము వీర్రాజు పై తీవ్ర కామెంట్లు ట్రోల్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News