ట్రబుల్ లో సోము.. అదే కారణమా?

రాజకీయాల్లో శత్రువును ఎదుర్కొనేందుకు శత్రువులంతా ఒక్కటవుతారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడి విషయంలోనూ అదే జరుగుతుంది. సోము వీర్రాజు శత్రువులంతా ఒక్కటవుతున్నారు. ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వానికి [more]

Update: 2020-12-28 09:30 GMT

రాజకీయాల్లో శత్రువును ఎదుర్కొనేందుకు శత్రువులంతా ఒక్కటవుతారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడి విషయంలోనూ అదే జరుగుతుంది. సోము వీర్రాజు శత్రువులంతా ఒక్కటవుతున్నారు. ఇప్పటికే పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు వల్ల పార్టీ బలోపేతం మాట అటుంచి, మరింత బలహీన పడే అవకాశముందని సీనియర్ నేతలు సయితం పార్టీ హైకమాండ్ కు నివేదికల రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఏడాది కూడా గడవక ముందే…..

సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టి ఏడాది కూడా గడవ లేదు. అయితే ఆయన వచ్చిన వెంటనే అనేక మందిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది. పార్టీ లైన్ కు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పదుల సంఖ్యలో సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. పూర్వపు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సన్నిహితులను కూడా పార్టీ నుంచి బయటకు పంపడంతో గత కొద్దిరోజులుగా సోము వీర్రాజు వ్యవహారం చర్చనీయాంశమైంది.

జనసేనతోనూ…..

అయితే తాజాగా జనసేనతోనూ సోము వీర్రాజు వ్యవహరించిన తీరును బీజేపీ నేతలే తప్పుపడుతున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ జాతీయ అధ్కక్షుడు జేపీ నడ్డాను కూడా కలసి వచ్చారు. ఎవరు పోటీ చేయాలన్న దానిపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయిద్దామని జేపీ నడ్డా కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ సమన్వయ కమిటీ ఏర్పాటు కాలేదు.

హైకమాండ్ కు ఫిర్యాదులు….

కానీ సోము వీర్రాజు మాత్రం తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని ప్రకటించారు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నొచ్చుకున్నట్లు తెలిసింది. ఎవరినీ సంప్రదించకుండానే సోము వీర్రాజు ఏకపక్షంగా ప్రకటించారని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అందుకే జనసేన అభ్యర్థి కోసం స్థానికంగా వెంటనే పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీలోని సోము వీర్రాజు వ్యతిరేక వర్గం పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మరి సోము ఇబ్బందుల్లో పడినట్లేనన్న చర్చ బీజేపీలో జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News