టార్గెట్ సోము… ఇక కష్టమేనట

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన నేత. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఆయనను ఏరికోరి అధ్యక్షుడిగా ఎంపిక [more]

Update: 2021-04-27 11:00 GMT

రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన నేత. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఆయనను ఏరికోరి అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. కానీ సోము వీర్రాజు పదవీ బాధ్యతలు చేపట్టిన ముహూర్తం బాగాలేనట్లుంది. ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం పనితీరు కనపర్చక లేకపోయింది. నేతలను సమన్వయం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం.

కరడు కట్టిన నేత….

సోము వీర్రాజు కరడు కట్టిన కమలం నేత. దానికి ఎవరూ కాదనలేరు. అదే సమయంలో పార్టీ ఎదగాలంటే అందరినీ కలుపుకుని పోవాల్సి ఉంటుంది. కానీ సోము వీర్రాజు మాత్రం అందుకు ఇష్టపడలేదు. ఏ ఎన్నిక వచ్చిన తన టీంతోనే ఆయన ముందుకు సాగారు. ఇది పార్టీ కేంద్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లిందంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభావం చూసిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికలోనైనా కనీస ప్రతిభను కనపర్చాల్సి ఉంది.

డిపాజిట్ దక్కితే?

తిరుపతి ఉప ఎన్నికలో కనీసం రెండో స్థానంలో ఉండాలన్నది సోమువీర్రాజు ప్రయత్నం. ఆయన అభ్యర్థిని ఎంపిక చేయకముందు నుంచే తిరుపతిలో మకాం వేసి పార్టీని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ మూలాలున్న వారిని ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. దీంతో పాటు జనసేనతో కూడా సోము వీర్రాజు వైఖరి ఆ పార్టీ క్యాడర్ కు ఆగ్రహం తెప్పించింది. చివరకు పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేంత వరకూ వారి అసంతృప్తి చల్లారలేదు.

టీడీపీ టార్గెట్ కూడా….?

ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఎలా చూసినా రెండో స్థానానికి వచ్చే అవకాశం లేదు. కనీసం డిపాజిట్లు దక్కితే చాలు అన్నది కొందరినేతల భావన. ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సయితం నేతలను సమన్వయం చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సోము వీర్రాజుకు ఈ తిరుపతి ఉప ఎన్నిక ఇబ్బందిగా మారనుందన్న సంకేతాలను ఆయన ఇచ్చి వెళ్లారు. మొత్తం మీద సోము వీర్రాజుకు తిరుపతి ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఉద్వాసన తప్పదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. టీడీపీ టార్గెట్ కూడా అదే. సోము ఉన్నంత వరకూ తమకు బీజేపీతో కలిసే అవకాశం ఉండదని భావించిన టీడీపీ నేతలు ఆ పార్టీనే టార్గెట్ చేశారంటున్నారు.

Tags:    

Similar News