సోము మాట నిలబెట్టుకుంటారా ?
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. ఇది కేవలం నినాదానికి పరిమితం అవుతుందా ? లేక దీనిపై వెల్లువెత్తిన ఉద్యమ తీవ్రతకు తలొగ్గి కేంద్రం ప్రయివేటీకరణ నిర్ణయం [more]
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. ఇది కేవలం నినాదానికి పరిమితం అవుతుందా ? లేక దీనిపై వెల్లువెత్తిన ఉద్యమ తీవ్రతకు తలొగ్గి కేంద్రం ప్రయివేటీకరణ నిర్ణయం [more]
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు.. ఇది కేవలం నినాదానికి పరిమితం అవుతుందా ? లేక దీనిపై వెల్లువెత్తిన ఉద్యమ తీవ్రతకు తలొగ్గి కేంద్రం ప్రయివేటీకరణ నిర్ణయం మానుకుంటుందా ? అంటే లేదు 100 శాతం తాము అనుకున్నదే చేస్తామని మోడీ సర్కార్ ప్రకటించేసింది. దీనిపై ఎపి లోని అధికార వైసిపి తో సహా విపక్షాలు సైతం ఒకే మాట మీద ఉన్నాయి. వారి విమర్శలు ఆరోపణలు ఎలా ఉన్నా ఏ ఒక్క పార్టీ మోడీ ప్రభుత్వ నిర్ణయం సరైనది కాదనే పోరాడుతున్నాయి.
ప్రయివేటీకరణను…
చిత్రంగా ఈ విషయం లో ఆంధ్రప్రదేశ్ బిజెపి శాఖ కూడా తమ ప్రభుత్వ నిర్ణయం కరెక్ట్ కాదనే పేర్కొనడం విశేషం. అంతే కాదు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షడు సోము వీర్రాజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకునేది తాము మాత్రమే అని ప్రకటించారు కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని ఆయన తెగేసి చెబుతున్నారు. తాము కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆయన వాగ్దానం తరువాతే …
విశాఖ ఉక్కు పరుల పరం కాకుండా తాము మాత్రమే అడ్డుకుంటామని సోము వీర్రాజు ప్రకటించాకే కేంద్రం ప్రకటన చేసింది. అదీ 100 శాతం అమ్మేయడానికే మేము రెడీ అని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు చేసిన బాస నీటి రాతగానే మిగులుతుందా ? అనే ప్రశ్న ఉదయిస్తుంది. అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు అందకుండా సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు ధైర్యంగా చేయడం సాధ్యమా అన్న చర్చ మొదలైంది.
నాయకత్వం మనసును తెలుసుకోకుండా?
తమ నాయకత్వం మనసు తెలుసుకోకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తే ఎపి లో అసలే అంతంత మాత్రంగా ఉన్న బిజెపి పరిస్థితి మరింత దయనీయం కానుంది. లేదు ఆయన అన్న మాట నిలబెట్టుకుంటే కమలానికి మైలేజ్ ఎంతోకొంత పెరగడంతో బాటు సోము వీర్రాజు వ్యాఖ్యలపై క్రెడిబిలిటీ లభిస్తుంది. ఇలాంటి స్థితిలోనే సోము వీర్రాజు ఆంధ్రుల సెంటిమెంట్ ను అధిష్టానం ముందు మరోసారి బలంగా వినిపించడానికె హస్తిన బాట పట్టారో లేక పార్టీ అంశాలు వివరించడంతో పాటు భవిష్యత్తు వ్యూహాలపై చర్చకు వెళ్ళారా అన్నది త్వరలో తేలనుంది.