ఈ కంపేరిజన్ ఏమైనా బాగుందా సోమూ.. ?
ఏపీ అప్పుల్లో ఉంది. రుణాంధ్ర ప్రదేశ్ అంటూ బీజేపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. దాంతో మండుకొచ్చిన వైసీపీ నేతలు రివర్స్ అటాక్ మొదలెట్టారు. కేంద్రంలో మోడీ సర్కార్ [more]
ఏపీ అప్పుల్లో ఉంది. రుణాంధ్ర ప్రదేశ్ అంటూ బీజేపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. దాంతో మండుకొచ్చిన వైసీపీ నేతలు రివర్స్ అటాక్ మొదలెట్టారు. కేంద్రంలో మోడీ సర్కార్ [more]
ఏపీ అప్పుల్లో ఉంది. రుణాంధ్ర ప్రదేశ్ అంటూ బీజేపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారు. దాంతో మండుకొచ్చిన వైసీపీ నేతలు రివర్స్ అటాక్ మొదలెట్టారు. కేంద్రంలో మోడీ సర్కార్ అప్పులు తేకుండా ఏం చేస్తోంది అంటూ సూటిగానే సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. అంతే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అప్పులు చేయకుండా కొత్త నోట్లు ముద్రించుకుంటున్నారా అని కూడా నిగ్గదీశారు. దాంతో ఏపీ బీజేపీ పెద్దాయన సోము వీర్రాజుకు బాగా కోపం వచ్చింది. కేంద్ర పెద్దల గోత్రాలు అడగకూడదు, అది మహాపరాధం అంటూ ముక్కున వేలుపెట్టి మరీ వైసీపీ నేతలకు సుద్దులు చెబుతున్నారు.
జీతాలు ఇస్తున్నారుట….
బీజేపీ పాలిత రాష్ట్రలలో జీతాలు పెన్షన్లు ఇస్తున్నారుట. ఇక అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా సాగుతున్నాయట. ఏపీలో మాత్రం జీతాలకు ఠికానా లేదు కానీ ఎందుకొచ్చిన పౌరుషం వైసీపీ లీడర్లూ అంటూ సోము వీర్రాజు ఎకసెక్కమాడుతున్నారు. ఇది ఓకే అనుకున్నా ఈ మధ్యనే మధ్యప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను భరించడం కష్టమని సగానికి సగం మందిని సెలవు మీద ఇంటికి పంపించేయాలని తీసుకొద్దామనుకున్న మహత్తరమైన పధకాన్ని గురించి సోము వీర్రాజు మరచిపోతే ఎలా అంటున్నారు వైసీపీ నేతలు.
అయినా పోలిక ఏంటి..?
అక్కడికీ సరే అనుకున్నా బీజేపీ రాష్ట్రాలతో ఏపీకి పోలిక ఎక్కడిది అన్న మాట కూడా ఉంది. ఏపీ కొత్తగా పుట్టిన రాష్ట్రం కింద లెక్క. అడ్డగోలు విభజనతో అన్ని విధాలుగా నష్టపోయిన రాష్ట్రం. అసలే నానా రకాల ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి రెండు సార్లు కరోనా వచ్చి మాడు పగిలేలా కొట్టింది. ఏపీలో పరిశ్రమలు లేవు, ఇతర రెవిన్యూ కూడా లేదు. మరి అప్పులు చేయకపోతే ఎట్లా అంటున్నారు వైసీపీ మంత్రులు. తమను ఆదుకోవాల్సింది పోయి ఇలా నిందలు వేయడం తగునా అని కూడ ఆగ్రహిస్తున్నారు.
యనమల మాటతో…?
ఇక గద్దె దిగిపోయే ముందు టీడీపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్న మాటలను కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రమే ఉంది. మేము మొత్తం అప్పులు తెచ్చేశాం. ఈ ప్రభుత్వం అప్పులు చేయాలన్న కూడా పైసా పుట్టదు అని యనమల నాడు వెటకారంగా అన్న మాటలను బట్టి చూసినా ఖజానా కొల్లేరు కావడం వెనక కారణం ఎవరు అన్నది బీజేపీ నేత సోము వీర్రాజు ఆలోచించుకోవాలి కదా అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తానికి ఎవరెన్ని చెప్పినా అప్పుతోనే పప్పు కూడు వండుకోవడం అన్నది అంతా చేస్తున్నదే ఇందులో తప్పేముంది, తప్పేదేముంది అంటూ వైసీపీ తీస్తున్న దీర్ఘాలకు బీజేపీ నేతల వద్ద సమాధానం ఉందా.