Spy reddy : మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా?

ఏదైనా అంతే.. రాజకీయల్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం వాటిని సరైన దిశగా అందిపుచ్చుకుంటే సరి. లేకుంటే ఇక అథపాతాళానికి పడిపోయినట్లే. ఒకప్పుడు పైపుల రెడ్డి [more]

;

Update: 2021-10-18 15:30 GMT

ఏదైనా అంతే.. రాజకీయల్లో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం వాటిని సరైన దిశగా అందిపుచ్చుకుంటే సరి. లేకుంటే ఇక అథపాతాళానికి పడిపోయినట్లే. ఒకప్పుడు పైపుల రెడ్డి అని పిలుచుకునే ఎస్పీవై రెడ్డి కుటుంబం ఇప్పుడు రాజకీయంగా పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లే అనిపిస్తుంది. నంద్యాల నియోజకవర్గాలను ఒకప్పుడు ఎస్పీవై రెడ్డి శాసించారు. నంద్యాల పార్లమెంటు సభ్యుడిగా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

పైపుల రెడ్డిగా….

నందిపైపులను కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం, ఒక రూపాయికే భోజనం వంటి కార్యక్రమాలతో ఎస్పీవై రెడ్డి ఆ ప్రాంత ప్రజలకు దగ్గరయ్యారు. పారిశ్రామికవేత్తగా సక్సెస్ సాధించిన ఆయన పాలిటిక్స్ లోనూ అదే విజయలను అందుకున్నారు. నంద్యాల ఎంపీగా అనేక సార్లు విజయం సాధించి ఎన్నో పనులు చేపట్టారు. కాంగ్రెస్, వైసీపీల నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. 2014లో నంద్యాల ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

మరణం తర్వాత….

అదే ఆయన చేసిన తప్పు. టీడీపీలో చేరిన ఆయన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరుపున విస్తృత ప్రచారం చేశారు.. అప్పటి వరకూ నంద్యాల అసెంబ్లీ టిక్కెట్ కోసం ఆయన చంద్రబాబు వద్ద పెద్ద పంచాయతీయే పెట్టారు. తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన జనసేనలో చేరి పోటీ చేశారు. వీల్ ఛెయిర్ లోనే ప్రచారం చేశారు. తర్వాత ఆయన మరణించారు.

వైసీపీలో చేరాలని….

ఇప్పుడు ఆ కుటుంబం జనసేనలో ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఇటు టీడీపీలోనూ లేదు. ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి మాత్రం వైసీపీలోకి వెళ్లాలని గట్టిగా భావిస్తున్నారు. ఇటు మామ పేరుతో పాటు పార్టీ కూడా తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వైసీపీతోనే ఉండాలని శ్రీధర్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలిసింది. త్వరలోనే ఆయన వైసీపీకి తిరిగి వెళతారన్న ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే మళ్లీ ఎస్పీవై రెడ్డి కుటుంబం వైసీపీలో కనపడుతుంది.

Tags:    

Similar News