ఇద్దరిదీ ఒకటే మాట… ఒకటే బాట?
కరోనాపై యుద్ధంలో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలది ఒకటే మాట గా దాదాపు ఉంది. మెజారిటీ రాష్ట్రాలు కట్టడి కోసం లాక్ డౌన్ తప్ప గత్యంతరం లేదన్న అభిప్రాయాన్ని [more]
కరోనాపై యుద్ధంలో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలది ఒకటే మాట గా దాదాపు ఉంది. మెజారిటీ రాష్ట్రాలు కట్టడి కోసం లాక్ డౌన్ తప్ప గత్యంతరం లేదన్న అభిప్రాయాన్ని [more]
కరోనాపై యుద్ధంలో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలది ఒకటే మాట గా దాదాపు ఉంది. మెజారిటీ రాష్ట్రాలు కట్టడి కోసం లాక్ డౌన్ తప్ప గత్యంతరం లేదన్న అభిప్రాయాన్ని బలంగా వినిపించేశాయి. ప్రధాని మోడీ ఇంకా ప్రకటించకుండానే లాక్ డౌన్ ను ఒడిశా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు లు ఈనెల 30 వరకు తప్పదని చెప్పడమే కాదు పొడిగిస్తూ నిర్ణయం తీసేసుకున్నాయి. అయితే ఏపీ మాత్రం ప్రజారోగ్యం, ఆర్ధికవ్యవస్థ రెండిటిని సమన్వయం చేసుకుంటూ లాక్ డౌన్ ఆంక్షలలో కొంత సడలింపు కోరింది. కేరళ సైతం ఇదే అభిప్రాయంతో ఉంది.
వారికే ముప్పు …
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను హైదరాబాద్ లో కరోనా సవాల్ చేస్తుంది. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో భాగ్యనగరం ఒకటి. శరవేగంగా విశ్వనగరంగా రూపుదాలుస్తున్న హైదరాబాద్ లో లాక్ డౌన్ తొలగిస్తే వైరస్ విజృంభించి భవిష్యత్తు మొత్తం అంధకారమే అయ్యే ప్రమాదం ఉంది. చెయ్యి దాటాకా ఏమి చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. దీనికి న్యూయార్క్ వంటి నగరమే ఉదాహరణ. తెలంగాణకు గుండెకాయవంటి హైదరాబాద్ కి విపత్తు విస్తరిస్తే కోలుకోవడం అంత సులువు కాదు. ప్రస్తుతం ముంబయి , ఢిల్లీ, చెన్నై లు ఇప్పటికే కరోనా రక్కసి చేతిలో హా హా కారాలు చేస్తున్నాయి. దాంతో టి సర్కార్ ముంగిట లాక్ డౌన్ బ్రహ్మస్త్రం ప్రయోగించడం తప్ప మరో దారి లేదు.
ఏపీ కి బండి నడవదు …
అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలంగాణ కు భిన్నమైన పరిస్థితి ఉంది. తీవ్ర ఆర్ధిక సంక్షోభం ముంగిట ఉన్న ఏపీ లో హైదరాబాద్ లాంటి భారీ నగరాలు ఏమి లేవు. విశాఖ లో కరోనా కంట్రోల్ లోనే వుంది. ఇక కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నా అదుపు చేయగల స్థాయిలోనే ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం లలో అయితే ఒక్క కేసు కూడా లేదు. దాంతో కొద్ది కొద్దిగా ఆంక్షలు సడలిస్తూ ఆర్ధిక రంగాన్ని ప్రజారోగ్యంతో పాటు కాపాడుకోక తప్పదు ఏపీకి. ఆంధ్రప్రదేశ అభిప్రాయంతో దేశంలో తొలి కరోనా కేసు నమోదు అయిన కేరళ సైతం గొంతు కలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆంక్షలు సడలించినా లేకపోయినా ఈ రెండు రాష్ట్రాల్లో కొన్ని కీలక నిర్ణయాలను స్థానిక ప్రభుత్వాలే తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.