విగ్రహాలే రాజకీయాలు చేస్తాయా?
విగ్రహ వివాదాలు మనకు కొత్తేమి కాదు… విగ్రహాల్లో వ్యక్తుల్ని, ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూడటం కంటే వివాదాలను చూడటమే మనకు ఎక్కువ అలవాటు. పదిహేనేళ్ల క్రితం నాగార్జున [more]
విగ్రహ వివాదాలు మనకు కొత్తేమి కాదు… విగ్రహాల్లో వ్యక్తుల్ని, ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూడటం కంటే వివాదాలను చూడటమే మనకు ఎక్కువ అలవాటు. పదిహేనేళ్ల క్రితం నాగార్జున [more]
విగ్రహ వివాదాలు మనకు కొత్తేమి కాదు… విగ్రహాల్లో వ్యక్తుల్ని, ఆ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూడటం కంటే వివాదాలను చూడటమే మనకు ఎక్కువ అలవాటు. పదిహేనేళ్ల క్రితం నాగార్జున యూనివర్సిటీలో మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఇలాగే వివాదం తలెత్తింది. దానికి కులం రంగు పులమడంతో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అసలు గాంధీ విగ్రహమే ఎందుకు ఏర్పాటు చేయాలి అన్నది కొందరి అభ్యంతరం. ఉద్యోగులు, అధ్యాపకులు కూడా ఈ విషయంలో చీలిపోయారు. వివాదం ఎటూ తెగక చివరకు యూనివర్సిటీలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్, జగజ్జీవన్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి అందర్నీ సంతృప్తి పరిచారు.
గతంలోనూ ఇంతే…..
ఓ నాలుగైదేళ్ల క్రితం బెజవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో గుఱ్ఱం జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేయలనుకున్నపుడు కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది. విగ్రహానికి అనుమతి ఇచ్చే విషయంలో రకరకాల సంఘాల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. జాషువా 120 జయంతి సమయంలోనే పూలే విగ్రహం కూడా వచ్చింది. అంతకు ముందు కళా క్షేత్రంలో విగ్రహాల ఏర్పాటు సందర్భంగా ఇలాంటి వివాదాలు తలెత్తినట్టు గుర్తు లేదు.
రాజకీయమే….
ఇప్పుడు స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన చేయగానే అక్కడ ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు విగ్రహాల మీద ప్రేమ కంటే విగ్రహాలను రాజకీయ అస్తిత్వాలుగా పరిగణించడమే ఈ తరహా ప్రశ్నలకు కారణం అయ్యుండొచ్చు. విగ్రహం ఏర్పాటు ద్వారా ఒరిగే లబ్ది తమకు దక్కకుండా పోతుందనే బాధ కూడా ఇందులో ఉంటుంది. ఇక ఇన్నాళ్లు ఊరి చివర ఉన్న విగ్రహం ఊరి మధ్యకు వస్తే, అది తమ అస్తిత్వాన్ని సవాలు చేసినట్టు భావన కూడా వారిలో ఉండొచ్చు. సోషల్ మీడియాలో బెజవాడ స్వరాజ్య మైదానం మీద ప్రేమతో రకరకాల సూచనలు, సలహాలు చూశాక నోరు లేని విగ్రహాల తరపున వకాల్తా.