సుజనాకు చెక్ పెట్టినట్లేనా …?

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గేమ్ సొంత పార్టీ నేతలకు సైతం అర్ధం కానీ రీతిలో కమలం వ్యవహారం సాగిపోతూనే వుంది. పాత, కొత్త నేతలతో కళకళలాడుతున్న కాషాయం [more]

Update: 2019-08-29 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గేమ్ సొంత పార్టీ నేతలకు సైతం అర్ధం కానీ రీతిలో కమలం వ్యవహారం సాగిపోతూనే వుంది. పాత, కొత్త నేతలతో కళకళలాడుతున్న కాషాయం పార్టీ కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిస్తోంది. ఇది క్యాడర్ కి సైతం ఇబ్బంది సృష్టిస్తుంది. కాంగ్రెస్ లో నేతల నోటికి తాళం ఉండదు. అదే రీతిలో వుంది ప్రస్తుత బిజెపి నాయకుల ప్రకటనలు. ఎంతో క్రమశిక్షణ అని చెప్పుకునే బిజెపి లో కొత్తగా వచ్చినవారు దూకుడు మాములుగా లేదు. పార్టీ విధానాలు ఎలా వున్నా టిడిపి విధానాలే తమ పార్టీ అజెండాగా వారు దూసుకుపోతున్నారనే విమర్శలు గమనించిన అధిష్టానం నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది.

జివిఎల్, సోము సీన్ లోకి అందుకే …

బిజెపి సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యుడు అధికారప్రతినిధి జివిఎల్ నరసింహారావు, ఎమ్యెల్సీ సోము వీర్రాజు లకు ఏం చేయాలో అధిష్టానం నిర్దేశించినట్లు హస్తిన సమాచారం. దాంతో వారు టిడిపి కి లబ్ది చేకూరే లా తమ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు చెక్ పెట్టేశారు. అమరావతి లో జరిగిన బాగోతాన్ని తక్షణం బయటపెట్టాలన్న డిమాండ్ తెరపైకి తెచ్చారు. రాజధాని మార్పు అంశం వైసిపి సర్కార్ నిర్ణయమని తేల్చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేసి ఉంటే రాజధాని మార్పు ఆలోచనే వచ్చేది కాదన్న ఘాటు వ్యాఖ్యలు చేయడంతో బాటు కేంద్రం ఈ అంశానికి సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ చెప్పినట్లు సీరియస్ గా తీసుకోవడం లేదన్న సంకేతాలు ఇచ్చేశారు.

అమరావతి లో రహస్య సమావేశాలు …

ఎపి రాజధాని మారిస్తే అనుసరించాలిసిన వ్యూహంపై గత కొద్ది రోజులుగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారు రహస్య సమావేశాలు మొదలు నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందుతుంది. సర్కార్ అమరావతిపై ఇచ్చే ప్రకటన వరకు ఆగాలని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని వీరంతా భావిస్తున్నట్లు తెలియవస్తుంది. వైసిపి సర్కార్ చంద్రబాబు రూపొందించిన రాజధాని ప్లాన్ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్లు హస్తినలోని ఒక అగ్రనేత అమరావతి పర్యటనలో చెప్పుకుని దిశా దశా చెప్పాలని కోరారని చెబుతున్నారు. తాజాగా వైసిపి అమరావతి అభివృద్ధిపై ఆసక్తి చూపడం లేదన్న క్లారిటీ ని జివిఎల్ ఇవ్వడంతో ఇప్పుడు రాజధాని వాతావరణం మరింత వేడిగా మారింది. ఇక దీనిపై ఇప్పుడు అందరి చూపు ముఖ్యమంత్రి జగన్ చేయబోయే ప్రకటన కోసం వేచి చూడటమే కావడంతో ఆయన ఏ నిర్ణయం చెబుతారా అన్నది ఉత్కంఠభరితంగా మారింది.

Tags:    

Similar News