గులాబీ పార్టీలో “గ్రేటర్” ఫీవర్

మొత్తం 150 వార్డులు… టార్గెట్ 100 ఇదీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మంత్రులకు విధించిన టార్గెట్. నవంబరు నెలలో గ్రేటర్ [more]

Update: 2020-10-17 09:30 GMT

మొత్తం 150 వార్డులు… టార్గెట్ 100 ఇదీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మంత్రులకు విధించిన టార్గెట్. నవంబరు నెలలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. నగరంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మరోసారి గులాబీ జెండాను గ్రేటర్ పై ఎగురేయాలని కేసీఆర్ ఆదేశించారు. నగరంలోని ఎమ్మెల్యేలందరూ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిందేనని చెప్పారు.

ఎమ్మెల్యేలకు టార్గెట్లు……

ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలకు భవిష్యత్ లో పదోన్నతులు ఉంటాయని కూడా కేసీఆర్ సంకేతాలను పంపారని తెలుస్తోంది. 18 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జులను నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అనగానే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అంతా చూసుకుంటారు. నిజమే అంతా కేటీఆర్ చూసుకుంటున్నా. ఎక్కడో అనుమానం. ప్రధానంగా యువత, ఉద్యోగులు కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని కేసీఆర్ భావిస్తున్నారు.

సీట్ల కేటాయింపులో….

దీంతో కేసీఆర్ ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించినట్లు తెలిసింది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 99 వార్డులున్నాయి. ఇందులో ఎక్కువ మంది కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని కూడా ఎమ్మెల్యేలతో చెప్పి కొత్త వారిని వార్డు అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సూచించినట్లు తెలిసింది. టీఆర్ఎస్ చేయించిన సర్వేలో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని తెలిసినా, అంతకంటే ఎక్కువ మందిపై అసంతృప్తి ఉన్నట్లు వెల్లడి కావడంతో ఎక్కువమంది సిట్టింగ్ లను మార్చాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది.

మంత్రులకు పరీక్ష…….

ఇక గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం నలుగురు మంత్రులున్నారు. వీరికి కూడా కేసీఆర్ కీలక బాధ్యతలను అప్పగించారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, మహమూద్ ఆలి, మల్లారెడ్డిలు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది. ప్రతి డివిజన్ ను తిరిగి అక్కడి సమస్యలను పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. దీంతో నగరంలోని మంత్రులకు గ్రేటర్ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులకు గ్రేటర్ ఫీవర్ పట్టుకుందనే చెప్పాలి.

Tags:    

Similar News