టీడీపీ కొత్త రేసు గుర్రాలు పరిగెడుతున్నాయ్ ?
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత 175 నియోజకవర్గాలకు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత 175 నియోజకవర్గాలకు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. గత ఎన్నికల తర్వాత 175 నియోజకవర్గాలకు 30 + నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు లేకుండా పోయారు. ఈ క్రమంలోనే ఇన్‌చార్జ్‌లు లేని చోట్ల ఎవరో ఒకరిని సెట్ చేసుకుంటూ వస్తున్నారు. టీడీపీకి మంచి పట్టున్న పశ్చిమ గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను సెట్ చేస్తున్నారు. ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణం తర్వాత అక్కడ పగ్గాలు ఆయన సోదరుడు బడేటి చంటికి ఇచ్చారు. చంటి పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ కర్రవిరక్కుండా .. పాము చావకుండా అన్న చందంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.
అంచనాలు లేకపోయినా?
ఏ విషయంలో అయినా తన వల్ల పని అవుతుందా ? కాదా ? అన్నదానిపై ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. పైగా అక్కడ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని తట్టుకుని మరీ చంటి పార్టీని సమర్థవంతంగానే నడిపిస్తున్నారు. ఇక తాడేపల్లిగూడెంలో టీడీపీ కొత్త ఇన్‌చార్జ్‌గా వచ్చిన వలవల బాబ్జీపై ముందు ఎలాంటి అంచనాలు లేవు. అయితే ఆయన అక్కడ వేస్తోన్న ఎత్తులు జిల్లా రాజకీయాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. స్థానికంగా జనసేనతో సర్దుబాటు చేసుకుని గత స్థానిక ఎన్నికల్లోనే పార్టీకి మంచి విజయాలు సాధించిపెట్టారు.
క్షత్రియ సామాజికవర్గానికే?
వలవల బాబ్జీ వ్యూహాలను టీడీపీ అధిష్టానం సైతం ప్రత్యేకంగా మెచ్చుకుంది. ఇక నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చేతులు ఎత్తేయడంతో చంద్రబాబు నీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్న రామరాజుకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. అక్కడ కాపు, శెట్టిబలిజ వర్గాలు బలంగా ఉన్నా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా క్షత్రియ వర్గానికే చెందిన ముదునూరు ప్రసాదరాజు ఉండడంతో టీడీపీ సైతం వ్యూహాత్మకంగా అదే వర్గానికి చెందిన రామరాజుకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. ప్రస్తుతానికి రామరాజు అక్కడ పార్టీని నడిపిస్తున్నారు. ఏదేమైనా పశ్చిమ టీడీపీలో ఈ ముగ్గురు కొత్త రేసుగుర్రాల పనితీరు అయితే బాగానే ఉంది.