నమ్మిన వారు మట్టికొట్టుకుని పోయారుగా?

అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. ఇది నన్ను చూసి, నన్ను నమ్మి అప్పగించిన బాధ్యత. అమరావతికి బాండ్స్ జారీ చేస్తే నా మీద నమ్మకంతో 2వేల రెండు [more]

Update: 2020-08-01 06:30 GMT

అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. ఇది నన్ను చూసి, నన్ను నమ్మి అప్పగించిన బాధ్యత. అమరావతికి బాండ్స్ జారీ చేస్తే నా మీద నమ్మకంతో 2వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు. నా అనుభవం గుర్తించే రుణాలు ఇచ్చేందుకు అంతా ముందుకు వస్తున్నారు. సింగపూర్ వంటి దేశాలతో పాటు మనదేశంలోని అన్ని రాష్ట్రాలు అమరావతి వైపే చూస్తూ ఉన్నాయంటే అది చంద్రబాబు వల్లే. ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు నవ్య ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అండ్ ఆయన టీం చేసిన విస్తృత ప్రచారం.

అరచేతిలో వైకుంఠం …

ఐదేళ్ళు అరచేతిలో వైకుంఠం చూపడంలో తన అనుభవాన్ని అంతా రంగరించి ఒక్కటి అంటే ఒక్కటి శాశ్వత నిర్మాణం రాజధాని ప్రాంతంలో చేయకపోగా డిజైన్ల పేరుతో కాలక్షేపం చేసిన చంద్రబాబు స్వయంకృత అపరాధం అమరావతి రైతులను నిండా ముంచేసింది. ఆయన్ను నమ్మి హైదరాబాద్ లో సైతం కొందరు ఆస్తులు అమ్ముకుని విజయవాడలో పెట్టుబడులు పెట్టినవారు మట్టికొట్టుకుపోయారు. ఈ చేదు వాస్తవాలన్నీ గవర్నర్ మూడు రాజధానులు ఆమోద ముద్ర వేయడంతో చంద్రబాబు కి క్లిస్టల్ క్లియర్ గా అర్ధమైంది. దాంతో ఈ పరిణామం చంద్రబాబు ను తీవ్రంగా కలచివేసింది. కళ్ళముందే జగన్ సర్కార్ తన డ్రీం ప్రాజెక్ట్ కి మంగళం పాడేయడం జీర్ణించుకోలేకపోయారు బాబు

నాకోసమా ఇదంతా ….

రోజులు ఎప్పుడు తాను చెప్పినట్లే ఉండవని చంద్రబాబుకు గద్దె దిగిన నాటినుంచి నెమ్మది నెమ్మదిగా తెలిసి వస్తుంది. అందుకే ఆయన గవర్నర్ ప్రకటన తరువాత భావోద్వేగానికి గురయ్యారు. నా ఆరోగ్యం సహకరిస్తే మరో పదేళ్ళు ఉంటా. నా కోసమా అమరావతి. నన్ను చూసి రైతులు ముందుకు రాలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. అమరావతి నాకోసం కాదని ఏదో ఒక రోజు అంతా తెలుసుకుంటారు. ఈ రోజు చీకటి రోజు అని వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబు ఆవేదన ఆందోళన. అంతా నేనే. నా వల్లే ప్రపంచ నగరం, హైదరాబాద్ అభివృద్ధి నాదే. ఇలా గతంలో చెప్పిన చంద్రబాబు వాయిస్ పూర్తిగా మారిపోయింది.

Tags:    

Similar News