బాబు వారికి బంపర్ ఆఫర్.. ఎవరి సీట్లు వారికేనట
ఎన్నికల్లో ఎత్తులు, పై ఎత్తులే ఉంటాయి. ఒకరు వేసిన ఎత్తులకు ప్రత్యర్థి పార్టీ పై ఎత్తులు వేయడం కామన్. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఎంత వేడెక్కిపోయి ఉన్నాయో [more]
ఎన్నికల్లో ఎత్తులు, పై ఎత్తులే ఉంటాయి. ఒకరు వేసిన ఎత్తులకు ప్రత్యర్థి పార్టీ పై ఎత్తులు వేయడం కామన్. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఎంత వేడెక్కిపోయి ఉన్నాయో [more]
ఎన్నికల్లో ఎత్తులు, పై ఎత్తులే ఉంటాయి. ఒకరు వేసిన ఎత్తులకు ప్రత్యర్థి పార్టీ పై ఎత్తులు వేయడం కామన్. ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఎంత వేడెక్కిపోయి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కౌంటర్ ప్రచారాలే తెలుగు మీడియా ఛానెల్స్‌కు న్యూస్ అయిపోయాయి. ఈ క్రమంలోనే వరుస ఎన్నికల వేళ ఏపీలో అధికార పార్టీ టీడీపీపై మైండ్ గేమ్ ఆడుతుంటే… అందుకు ధీటుగానే టీడీపీ కూడా వైసీపీపై మైండ్ గేమ్ ఆడుతూ ఈ రాజకీయాన్ని రసవత్తరం చేస్తోంది. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే నలుగురు వైసీపీ చెంత చేరారు. సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం చాటుకుంది. రేపు మున్సిపల్, కార్పొరేషన్లతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల చూసుకుని పార్టీ మారేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని.. వీరు మాతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ఉన్నత స్థాయి వర్గాలే ప్రచారం చేస్తున్నాయి.
ఎమ్మెల్యేలు చేరుతున్నారంటూ…..
ఇది నిజమా ? కాదా ? అన్నది పక్కన పెడితే గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం స్టార్ట్ చేశారో లేదో 50 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నారంటూ నాడు టీడీపీ వింగ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక ఇప్పుడు వైసీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండడంతో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేల్లో బాలయ్య, బాబును పక్కన పెట్టేస్తే మిగిలిన 17 మందిలో 10 మంది ఏ మాత్రం యాక్టివ్‌గా ఉండడం లేదు.. వీరిలో కొందరిని నమ్మే పరిస్థితి లేదని టీడీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.
టీడీపీ రివర్స్ కౌంటర్ …
వైసీపీ చేస్తోన్న ఈ ప్రచారంతో అసలే అంతంత మాత్రంగా ఉన్న తాము మరింత డిఫెన్స్‌లో పడిపోతున్నామని గ్రహించిన టీడీపీ రివర్స్ ప్రచారం ప్రారంభించింది. టీడీపీ నుంచి పార్టీ మారిన వారు వైసీపీలో తమను పట్టించుకోవడం లేదని… వీరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం ప్రారంభించింది. పార్టీ మారిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ మంత్రి, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఇంటి దారి గుర్తు వచ్చింది.. వారు తిరిగి వస్తే వాళ్ల సీట్లు వాళ్లకే ఇస్తామంటూ టీడీపీ వాళ్లు చెపుతున్నారు. ఈ లిస్టులో వారు పేర్లు కూడా రివీల్ చేస్తున్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేల్లో కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఉన్నారని చెపుతున్నారు.
గ్రూపుల గోలతో…..
ఇక ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు గోదావరి జిల్లాలకు చెందిన వారు అని చెపుతున్నారు. అయితే వైసీపీ చేస్తోన్న ప్రచారంలో ఎంతో కొంత నిజం ఉందని అనుకుంటే… టీడీపీ చేస్తోన్న రివర్స్ ప్రచారంలో కూడా కొంత నిజం ఉందనే అనుకోవాలి. పార్టీ మారిన వారిలో గిరికి అసలు ప్రాధాన్యమే లేదు. కరణం, వంశీ గ్రూపుల గోలతో సతమతమవుతున్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎన్నికలకు ముందు అయినా పార్టీ మారిపోతారని.. వీరి వ్యక్తిత్వానికి వైసీపీలో ఇమడ లేరని అంటున్నారు. ఇక టీడీపీలో పదిహేనేళ్లకు పైగా ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావును వైసీపీలో చేరాక పట్టించుకునే వాళ్లే లేరు. ఆయన మనస్తత్వానికి కూడా వైసీపీలో ఇమిడే పరిస్థితి లేదు. ఇక గోదావరి జిల్లాల్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలది ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీపై… టీడీపీ వైసీపీపై ప్రచారాలు చేస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీల నేతల ప్రచారాల్లో ఎవరి ప్రచారం నిజం అవుతుందో ? చూడాలి.