బీటెక్ రవి జంప్ అటగా? ఏం జరుగుతోంది…?
మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. అలియాస్ బీటెక్ రవి…! కడప జిల్లా నుంచి వచ్చిన యువ నాయకుడిగా పేరున్న ఈయన టీడీపీలో మంచి గుర్తింపు పొందారు. ప్రధానంగా గతంలో [more]
మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. అలియాస్ బీటెక్ రవి…! కడప జిల్లా నుంచి వచ్చిన యువ నాయకుడిగా పేరున్న ఈయన టీడీపీలో మంచి గుర్తింపు పొందారు. ప్రధానంగా గతంలో [more]
మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. అలియాస్ బీటెక్ రవి…! కడప జిల్లా నుంచి వచ్చిన యువ నాయకుడిగా పేరున్న ఈయన టీడీపీలో మంచి గుర్తింపు పొందారు. ప్రధానంగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డినే ఓడించి రికార్డు రేంజ్‌లో టీడీపీలోనే కాకుండా ఒక్కసారిగా రష్ట్రస్థాయిలో హైలెట్ అయ్యారు. అంతేకాదు ఇటీవల జగన్ సర్కారు వైఖరికి నిరసనగా.. ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు ఎందరు ఉన్నా.. బీటెక్ రవి స్థానం ఆయనదే అన్నట్టుగా వ్యవహరించారు.
కీలక నేతగా ఎదిగి….
తాను రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా ఎదగడంతో పాటు కడప జిల్లాలో పార్టీ అభివృద్ధి అనే రెండు లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగిన బీటెక్ రవికి.. పార్టీ కూడా అన్ని విధాలా అండగానే నిలిచింది. గత ఏడాది ఎన్నికలకు ముందుకు.. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం.. పోరాడిన వారిలో బీటెక్ రవి కూడాఉన్నారు. ఇలాంటి నాయకుడు.. గడిచిన నాలుగైదు నెలలుగా మౌనం పాటించడం గమనార్హం. ఇప్పటికే కడపలో కీలక నేతలు బీజేపీలోకి చేరిపోవడం.. మౌనంగా ఉండడం.. పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు లేక పోవడంతో ఒకరకంగా పార్టీ ఇబ్బందుల్లో పడింది.
బీజేపీతో టచ్ లోకి….
అయితే.. ఈ సమయంలో రవి వంటి వారు ముందుండి పోరాడతారని అనుకున్నా.. తాజాగా బీటెక్ రవి పార్టీకి దూరంగా ఉన్నారా ? అనే సందేహాలు వస్తున్నాయి.రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అదేవిధంగా నాయకులు ఎంత నిబద్ధులైనా.. వారికీ కొన్ని పాటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి టర్న్ అయినా తీసుకోవచ్చనేది తెలిసిందే. బీజేపీ కీలక నాయకుడు ఒకరు ఇటీవల బీటెక్ రవితో టచ్‌లోకి వచ్చారని.. బీజేపీలోకి రావాలని ఆహ్వానించారని గుసగుస వినిపిస్తోంది.
బాబుకు వీరవిధేయుడైనా….?
ఇప్పుడు బీటెక్ రవి పార్టీలో ఉన్నా ఆయనకు వచ్చే ఉపయోగం లేదు. పులివెందుల టిక్కెట్ ఇచ్చినా అక్కడ జగన్‌ను ఢీ కొట్టి గెలవడం అసాధ్యం. వాస్తవానికి చంద్రబాబు అంటే వీరవిధేయుడైన బీటెక్ రవి పార్టీ మారే ఉద్దేశం లేదు. కానీ, మారుతున్న పరిణామాలు.. పార్టీ అస్తిత్వం వంటివాటిని పరిగణ నలోకి తీసుకుంటే.. ఏనేత ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పేపరిస్థితి లేదు కనుక… ఏమైనా జరగొచ్చు. గతంలో సీఎం రమేష్ వెళ్లిపోలేదా ? అని ప్రశ్నిస్తున్నారు కొందరు.