ఆయన్ని చూసి జగన్ నేర్చుకోవాలా?

కేసీఆర్ రాజకీయాల్లో తలపండిన వారు. ఆయన రాజకీయం కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఆయన ఎపుడు ఎవరికి మిత్రుడో, ఎవరికీ శత్రువో తెలియదు. ఇదిలా ఉండగా కేసీఆర్ [more]

Update: 2019-09-11 03:30 GMT

కేసీఆర్ రాజకీయాల్లో తలపండిన వారు. ఆయన రాజకీయం కూడా చాలా చిత్రంగా ఉంటుంది. ఆయన ఎపుడు ఎవరికి మిత్రుడో, ఎవరికీ శత్రువో తెలియదు. ఇదిలా ఉండగా కేసీఆర్ తాజాగా మంత్రివర్గ విస్తరణలో పావులు వేగంగా కదిపి బీజేపీకి చెక్ పెట్టేశారు. ఇప్పట్లో అయితే బీజేపీ తెలంగాణాలో అడుగుపెట్టడానికి లేకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అన్నిటికీ మించి కేసీఆర్ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఒక విశేషం. అందులో కూడా ఆర్ధికమంత్రిగా మేనల్లుడు హరీష్ రావును సీట్లో కూర్చోబెట్టి మరీ కేసీఆర్ తానే స్వయంగా అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించారు. దీని వెనక అసలు కారణం ఏంటన్నది బడ్జెట్ స్వరూపం, స్వభావం చూసిన తరువాత అందరికీ అర్ధమైంది. కేసీఆర్ నోట్లో నుంచి వస్తేనే ఆ బడ్జెట్ కి సార్ధకత. ఇక ఆ బడ్జెట్లో కేంద్రాన్ని తూర్పార పట్టాలన్నా కూడా కేసీఆర్ ర్ కే సాధ్యం. మొత్తానికి కేసీఆర్ బడ్జెట్ వాస్తవాలకు దగ్గరగా ఉందనిపించింది.

కేంద్రాన్ని కడిగేసేందుకే …..

కేసీఆర్ బడ్జెట్లో ప్రధాన అంశాలన్నీ ఎలా ఉన్నా కేంద్ర కేటాయింపులు లేవన్నది నిజాన్ని తెలంగాణా సమాజానికి విడమరిచి విప్పిచెప్పారు. తెలంగాణా నుంచి కేంద్రానికి ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వెళ్తూంటే కేంద్రం మాత్రం నిక్కీ నీలిగి ఇచ్చేది ముష్టేసినట్లుగా 35 వేల కోట్ల రూపాయలేనని నిండు అసెంబ్లీ సాక్షిగా తేల్చేశారు. అంటే కేంద్రంపైన ఎటువంటి ఆశలు లేవని, వారు తెలంగాణాకు ఏమీ ఇవ్వడం లేదన్న నిజాన్ని చెప్పడం ద్వారా కమలం పార్టీకి ముకుతాడు వేయగలిగారు. వెనకబడిన జిల్లాలకు కూడా కేంద్ర సాయం ఏమీ లేదని కూడా కేసీఆర్ చెప్పడం ద్వారా ఇక్కడ ప్రజల నుంచి సొమ్ము తీసుకెళ్ళి ఏమీ ఇవ్వకుండానే రాజకీయం చేయడానికి వస్తోందన్న సందేశాన్ని వినిపించగలిగారు. దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిని బీజేపీ నేతలకు కల్పించారు.

అయిదో వంతు కుదింపు…..

ఇక తెలంగాణా అంటే సంపన్న రాష్ట్రంగా పేరు ఉంది. ఒక్క హైదరాబాద్ చాలు ఆదాయం సమకూరుతుంది. అటువంటి తెలంగాణా ఇపుడు బీద అరుపులు వెనక రాజకీయం ఓ వైపు ఉంటే ముందు చూపు మరో వైపు ఉందంటున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో లక్షా ఎనభై వేల రూపాయల పై చిలుకు కేటాయింపులు జరిపిన కేసీఆర్ సర్కార్ అసలు బడ్జెట్ నాటికి దాన్ని లక్షా నలభై వేలకు కుదించడం వెనక కారణాలు సుస్పష్టం. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే రాజకీయ కారణాత్లో కేంద్రం నిధుల పంపిణీ ఉంటోందన్నది మరో ప్రధాన ఆరోపణ. దాన్ని కేసీఆర్ బడ్జెట్ ద్వారా ఎక్స్ పోజ్ చేయగలిగారు.

Tags:    

Similar News