ప‌క్క రాష్ట్రాల‌కున్న ప్రయార్టీ.. ఏపీకి లేదేం..? కేసీఆర్ వ్యూహ‌మేంటి…?

“ భౌతికంగా విడిపోయినా.. మాన‌సికంగా క‌లిసి ఉంటాం. అన్నద‌మ్ముల్లా స‌హ‌క‌రించుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆద‌ర్శంగా ఎదిగేలా ఒక‌రికొక‌రం అందిపుచ్చుకుంటాం “-ఇదీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన [more]

Update: 2020-10-07 03:30 GMT

“ భౌతికంగా విడిపోయినా.. మాన‌సికంగా క‌లిసి ఉంటాం. అన్నద‌మ్ముల్లా స‌హ‌క‌రించుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాలు దేశానికే ఆద‌ర్శంగా ఎదిగేలా ఒక‌రికొక‌రం అందిపుచ్చుకుంటాం “-ఇదీ తెలంగాణ రాష్ట్రం విడిపోయిన సంద‌ర్భంగా ఆ రాష్ట్ర ఉద్యమ నాయ‌కుడు ప్రస్తుతం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఈ మాట‌లు చెప్పమ‌ని ఎవ‌రూ ఆయ‌నను అడ‌గ‌లేదు. ఆయ‌నే స్వయంగా చెప్పారు. ఏపీకి త‌ల్లో నాలుక‌గా ఉంటామన్నారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి.. దాదాపు 8 సంవ‌త్సరాలు అయింది. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి.. ఏడేళ్లు పూర్తవుతున్నాయి. అయితే.. నిజంగానే ఆయ‌న చెప్పిన మాట‌పై నిల‌బ‌డ్డారా? అనేది ప్రశ్న.

జగన్ అధికారంలోకి వచ్చాక…..

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజ‌కీయ కార‌ణాలు, ఇగో వంటివి అడ్డు వ‌చ్చాయి. సో.. స‌హ‌క‌రించుకోలేదు. పైగా రాజ‌కీయంగా చంద్రబాబు త‌మ‌ను దెబ్బకొట్టేందుకు ప్ర‌య‌త్నించార‌నే వాద‌న‌ను కూడా కేసీఆర్ తెర‌మీదికి తెచ్చారు. దీనిని కూడా ఏపీ ప్రజ‌లు విశ్వసించారు. మ‌రి ఇప్పుడు ఆయ‌న మిత్రుడు, వైసీపీ అధినేత జ‌గ‌న్ అధికారంలో ఉన్నారు. మ‌రి ఈయ‌న‌కు స‌హ‌క‌రిస్తున్నారా ? అనేది కూడా మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్నగానే ఉంది. సీఎంగా జ‌గ‌న్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. ఇక్కడ భోజ‌నం చేసి వెళ్లారు. త‌ర్వాత కూడా రెండు సార్లు వ‌చ్చారు. చ‌ర్చలు జ‌రిపారు.

ఇతర రాష్ట్రాలకు…..

ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విష‌యంలో జ‌గ‌న్ చాలా ఉదారంగా వ్యవ‌హ‌రించ‌డంతో ఇద్దరి మ‌ధ్య బంధం మ‌రింత స్ట్రాంగ్ అయ్యింద‌నుకున్నారు. ఆ త‌ర్వాత స‌‌ముద్రంలోకి పోతున్న గోదావ‌రి నీటిని నాలుగు చేతులు అడ్డు పెట్టి ప‌ట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల‌ను స‌స్యశ్యామలం చేస్తామ‌న్నారు. కానీ, క‌ట్ చేస్తే.. ఇప్పుడు రిక్త హ‌స్తాలే క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌కు పొరుగున ఉన్న ఏపీని ప‌ట్టించుకోని కేసీఆర్‌.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్రల‌కు ఇస్తున్న ప్రాధాన్యం ఏపీకి ఇవ్వడం లేద‌నే చ‌ర్చలు స్టార్ట్ అయ్యాయి.

ఏపీ పట్ల మొండిగా…..

అనేక వివాదాలు ఉన్నా.. ప‌రిష్కారానికి ముందుకు రావ‌డం లేదు. నీళ్ల విష‌యంలో తాడో పేడో తేల్చుకుంటామ‌ని చెబుతున్నారే త‌ప్ప.. ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నించ‌డం లేదు. ఇక‌, ఆర్టీసీ విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల‌తో స‌ర్దుబాటు ధోర‌ణిలో ముందుకు సాగుతున్న కేసీఆర్‌.. ఏపీ విష‌యంలో మొండిగా వ్యవ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఉంది. మ‌రి ఇదేనా..? స‌హ‌కారం అనే ప్రశ్నకు ఆయ‌న ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

Tags:    

Similar News