వరసగా…ఒక్కొక్కరుగా…!!!

తెలుగుదేశం పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వరసగా ఒక్కొక్క టీడీపీ నేత వైసీపీ టార్గెట్ లో ఉన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చక్రం [more]

Update: 2019-08-28 06:30 GMT

తెలుగుదేశం పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. వరసగా ఒక్కొక్క టీడీపీ నేత వైసీపీ టార్గెట్ లో ఉన్నట్లు కనపడుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన నేతలు, తమను లక్ష్యంగా చేసుకున్న వారినే వైసీపీ ఇబ్బంది పెట్టాలని చూస్తుందని టీడీపీ నేతలు దాదాపుగా డిసైడయిపోయారు. దీంతో వీరు చంద్రబాబు వద్దకు వచ్చి తమ గోడును విన్పించుకుంటున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తర్వాత యరపతినేని శ్రీనివాసరావు ఇలా వరసగా టీడీపీ నేతలపై కేసుల ఉచ్చు బిగుసుకుంటోంది.

కోడెల ఇరుక్కున్నట్లేనా….?

స్పీకర్ గా వ్యవహరించిన కోడెల ఫర్నీచర్ తరలింపు కేసులో ఇరుక్కున్నారు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ నుకోడెల తన కుమారుడి ప్రయివేటు షోరూంకు తరలించడంపై ఇప్పటికే కేసు నమోదయింది. కోడెల ఇప్పటికే కుక్కిన పేను అయిపోయారు. అనేక కేసులు ఆయన కుటుంబ సభ్యులపై పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులన్నీ త్వరలోనే లైన్లోకి రానున్నాయి. దీంతో టీడీపీ నేత కోడెల శివప్రసాద్ కష్టాల్లోకి దాదాపుగా వెళ్లిపోయినట్లే కన్పిస్తుంది.

యరపతినేనిపై…..

ఇక కోడెల తర్వాత టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు టార్గెట్ గా కన్పిస్తున్నారు. ఆయన పై ఇప్పటికే సీబీఐ విచారణకు అనుమతి హైకోర్టు అనుమతి ఇచ్చింది. యరపతినేని శ్రీనివాసరావుపై అక్రమ మైనింగ్ ఆరోపణలున్నాయి. అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు సీఐడీ కూడా నిర్ధారించింది. యరపతినేని బ్యాంకు లావాదేవీల్లో కూడా లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో యరపతినేని శ్రీనివాసరావుపై త్వరలోనే ప్రభుత్వం చర్యలకు దిగే అవకాశముంది. యరపతినేని శ్రీనివాసరావు కూడా మానసికంగా అందుకు సిద్ధమయినట్లే కన్పిస్తుంది.

తర్వాత ప్రత్తిపాటి…..

ఇక యరపతినేని తర్వాత మూడో నేత వైసీపీ టార్గెట్ లో ఎవరన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తర్వాత టార్గెట్ అన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కుటుంబానికి బినామీగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ గతంలో పుల్లారావుపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని భూములు, అగ్రిగోల్డ్ వ్యవహరం వంటి వాటిల్లో పుల్లారావు పేరు అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై భూకబ్జా కేసు నమోదయింది. సోమిరెడ్డితో పాటు ముగ్గురిపై ప్రభుత్వ భూమిని అక్రమంగా వినియోగించారని కేసు నమోదయింది. దీనిపై చంద్రబాబు కూడా సన్నిహితులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News