జగన్ కన్ఫర్మ్ చేసింది ఈయనకేనట

జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ సంపాయించుకునే వారిలో చాలా మంది సీనియ‌ర్లు లైన్‌లో ఉన్నారు. వాస్తవానికి తొలి కేబినెట్‌లోనేమంత్రి ప‌ద‌వులు ద‌క్కాల్సి ఉన్నప్పటికీ.. వివిధ రాజ‌కీయ కార‌ణాలు, ఎన్నిక‌ల [more]

Update: 2019-09-28 00:30 GMT

జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ సంపాయించుకునే వారిలో చాలా మంది సీనియ‌ర్లు లైన్‌లో ఉన్నారు. వాస్తవానికి తొలి కేబినెట్‌లోనేమంత్రి ప‌ద‌వులు ద‌క్కాల్సి ఉన్నప్పటికీ.. వివిధ రాజ‌కీయ కార‌ణాలు, ఎన్నిక‌ల మూడ్ వంటి కార‌ణంగా.. జూనియ‌ర్లకు కూడా జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే, ఆ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన ప్రక‌ట‌న ఒక‌టి సీనియ‌ర్లలో ఆశ‌లు రేకెత్తిస్తోంది. రెండున్నరేళ్ల త‌ర్వాత తాను ఖ‌చ్చితంగా కేబినెట్‌ను విస్తరిస్తాన‌ని, మిగిలిన వారికి ఛాన్స్ ఇస్తాన‌ని జ‌గ‌న్ చెప్పడంతో ఈ జాబితాలో త‌న పేరు ఖాయ‌మ‌ని అనుకునే వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తెల్లం బాల‌రాజు.

తొలి కేబినెట్ లోనే….

ఎస్టీ కోటాలో త‌న‌కు రెండున్నరేళ్ల త‌ర్వాత సీటు ఖాయ‌మ‌ని తెల్లం బాలరాజు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజకీయ అడుగులు ఎలా ప‌డ్డాయో.. జ‌గ‌న్‌కు ఎలా స‌న్నిహిత‌మ‌య్యారో చూస్తే తొలి కేబినెట్లోనే తెల్లం బాలరాజుకు మంత్రి ప‌ద‌వి రావాల్సి ఉంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎస్టీల‌కు రిజ‌ర్వ్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తెల్లం బాల‌రాజు ఇక్కడ గ‌ట్టి నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఇప్పటి వ‌ర‌కు మొత్తంగా ఆయ‌న నాలుగు సార్లు గిరిజ‌నుల మ‌న‌సు దోచుకున్నారు. 2004, 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున‌ తెల్లం బాలరాజు గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, వైఎస్ మ‌ర‌ణం.. త‌ర్వాత వైసీపీ ఏర్పాటుతో తెల్లం బాలరాజు కాంగ్రెస్‌ను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుని జ‌గ‌న్‌కు జై కొట్టారు.

సీనియర్…నమ్మకస్థుడిగా…

ఈ క్రమంలోనే 2012 ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి 45 వేల ఓట్లతో హ్యాట్రిక్ కొట్టారు. ఆ త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో అదే పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, తాజా ఎన్నిక‌ల్లో విజ‌యం సొంతం చేసుకున్నారు వైసీపీలో తెల్లం బాలరాజు సీనియ‌ర్‌గా ఉన్నారు. జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మకస్తుడిగా మెలిగారు. నిజానికి ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో తెల్లం బాలరాజుకు టికెట్ ఇవ్వద్దని చెప్పినా.. జ‌గ‌న్ ఆయ‌న‌కు ఇచ్చారు. దీంతో ఆయ‌న 40 వేల ఓట్లతో విజ‌యం సాధించారు. ఈ క్రమంలోనే త‌న‌కు జ‌గ‌న్ కేబినెట్‌లో సీటు ఖాయ‌మ‌ని అనుకున్నారు. అయితే, కురుపాం నుంచి గెలిచిన పాముల పుష్పశ్రీవాణికి జ‌గ‌న్ కేబినెట్‌లో బెర్త్ ఇచ్చారు. ఎస్టీ + మ‌హిళా కోటాలో ఆమె మంత్రి ప‌ద‌వి త‌న్నుకుపోయారు. ట్విస్ట్ ఏంటంటే ఆమె కురుపాం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆమె పుట్టినిల్లు పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గమే.

ఖచ్చితంగా వస్తుందని…..

అయితే, రెండున్నరేళ్ల త‌ర్వాత మార్పు త‌థ్యమ‌ని జ‌గ‌న్ చెప్పడంతో తెల్లం బాలరాజు త‌న‌కు బెర్త్ ఖాయ‌మ‌ని అనుకుంటున్నారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు గా కూడా ప‌నిచేయ‌డం, పార్టీని అభివృద్ధి చేయ‌డం, గ‌త ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. పార్టీని న‌డిపించ‌డం, టీడీపీపై విమ‌ర్శలు చేయ‌డంతోపాటు ప్రభుత్వ తీరును ఎండ‌గ‌డుతూ.. స్థానిక ఎమ్మెల్యే అవినీతిని తెర‌మీదికి తీసుకురావ‌డం గిరిజ‌నుల‌కు మ‌రింత చేరువ కావ‌డం వంటివి తెల్లం బాలరాజుకు పెట్టని కోట‌లుగా మారాయి. ఈ క్రమంలోనే తెల్లం బాలరాజుకు ఖ‌చ్చితంగా రెండున్నరేళ్ల త‌ర్వాత ఎస్టీ కోటాలో బెర్త్ ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు కూడా అంటుండ‌డం విశేషం.

Tags:    

Similar News